కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు లోపాయికారి ఒప్పందం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ను బీజేపీ వ్యతిరేకిస్తుందని తెలిపారు.
మజ్లిస్ పార్టీతో ఒప్పందం మేరకే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు.అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా నియమించి కాంగ్రెస్ సంప్రదాయాలను కాలరాసిందని మండిపడ్డారు.
ప్రొటెం స్పీకర్ గా సీనియర్ సభ్యులను మాత్రమే నియమించాలని తెలిపారు.ఈ క్రమంలోనే స్పీకర్ ఎన్నికను నిలిపివేయాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.