జబర్దస్త్ షో ద్వారా ఊహించని రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకున్న హైపర్ ఆది 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేయనున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జబర్దస్త్, ఇతర కామెడీ షోల ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది పవన్ కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే.
జనసేన సభలలో హైపర్ ఆది ప్రసంగాలకు ప్రజల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే 2024 ఎన్నికల్లో హైపర్ ఆది ఏపీలోని గిద్దలూరు లేదా దర్శి నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.
జనసేన కోసం ఎంతో కష్టపడిన వ్యక్తులలో హైపర్ ఆది ఒకరు కావడంతో పాటు హైపర్ ఆదికి ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉండటం కూడా అతనికి ప్లస్ అవుతోంది.అయితే పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.
హైపర్ ఆది ఎక్కడినుంచి పోటీ చేసినా ఆది గెలవడానికి తమ వంతు సహాయసహకారాలు అందిస్తామని జనసైనికులు చెబుతున్నారు.హైపర్ ఆది ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది.బుల్లితెరపై ప్రస్తుతం భారీ పారితోషికం అందుకుంటున్న కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు.సినిమాలలో కూడా హైపర్ ఆదికి ఎక్కువగానే ఆఫర్లు వస్తున్నాయి.హరిహర వీరమల్లు సినిమా కోసం కూడా హైపర్ ఆది పని చేస్తున్నారని తెలుస్తోంది.
హైపర్ ఆది ఇప్పటికే ఆర్థికంగా కూడా స్థిరపడ్డారు.జబర్దస్త్ లో స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత హైపర్ ఆది భారీ స్థాయిలో ఆస్తులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.హైపర్ ఆది ఎన్నికల్లో పోటీ చేయాలని అభిమానులు సూచిస్తున్నారు.
భవిష్యత్తులో హైపర్ ఆది తన భవిష్యత్తుకు సంబంధించి మరిన్ని వివరాలు చెప్పే ఛాన్స్ అయితే ఉంది.హైపర్ ఆది నెల ఆదాయం 6 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉందని బోగట్టా.