CM Ramesh : ఇస్తే విశాఖ లేదా అనకాపల్లి నుంచే పోటీ : సీఎం రమేష్

తెలుగుదేశం పార్టీతో తాజాగా పొత్తు కుదుర్చుకున్న కేంద్ర అధికార పార్టీ బిజెపి పొత్తు లో భాగంగా  ఆరు ఎంపీ సీట్లను తీసుకుంది.టిడిపి జనసేన బిజెపి( TDP Janasena BJP ) ఉమ్మడిగా ఈ ఎన్నికలకు వెళ్లి ఏపీ అధికార పార్టీ వైసీపీని ఎదుర్కోబోతున్నాయి.

 Cm Ramesh To Contest From Visakhapatnam Or Anakapalli Parliament-TeluguStop.com

బిజెపికి కేటాయించాల్సిన ఆరు ఎంపీ స్థానాలలో కొన్ని సీట్ల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది .ముఖ్యంగా టిడిపి ఇచ్చే ఆరు ఎంపీ స్థానాలలో విశాఖను తమకు కేటాయించాల్సిందిగా బిజెపి కోరుతున్నా,  చంద్రబాబు మాత్రం ఆ సీటును వదులుకునేందుకు ఇష్టపడడం లేదు.ఈ నేపథ్యంలో విశాఖ  ఎంపీ స్థానం పై( Visakha MP Seat ) ఆశలు పెట్టుకున్న బీజేపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్( CM Ramesh ) ఈ వ్యవహారం పై తాజాగా స్పందించారు.

Telugu Anakapalli, Chandrababu, Cm Ramesh, Janasena, Pawan Kalyan, Tdpbjp, Visak

బిజెపికి విశాఖ ఎంపీ సీటుకు బదులుగా అనకాపల్లి ఎంపీ సీటు( Anakapalli MP Seat ) కేటాయించాలని చంద్రబాబు భావిస్తుండగా బిజెపి మాత్రం ఉత్తరాది ఓటర్లు ఎక్కువగా ఉన్న విశాఖ సీటు ను తమకు కేటాయిస్తే ఖచ్చితంగా  గెలుస్తాం అనే ధీమా బీజేపీ లో కనిపిస్తోంది.తాను కూడా విశాఖ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా సీఎం రమేష్ వెల్లడించారు.  ఈ రోజు పార్టీ నేతల భేటీలో మాట్లాడుతూ విశాఖ నుంచి పోటీ చేసేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లుగా సీఎం రమేష్ తెలిపారు .అయితే అధిష్టానం ఏ సీటు కేటాయించినా, తాను పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నానని రమేష్ ప్రకటించారు.

Telugu Anakapalli, Chandrababu, Cm Ramesh, Janasena, Pawan Kalyan, Tdpbjp, Visak

ఈ సందర్భంగా ఏపీ అధికార పార్టీ వైసీపీ పై( YCP ) విమర్శలు చేశారు .బిజెపి, టీడీపీ, జనసేన పొత్తుతో తాడేపల్లి కోటలు కదులుతున్నాయని రమేష్ సెటైర్లు వేశారు.విపక్షాల పొత్తుతో అధికార పార్టీలో భయం కనిపిస్తుందని,  రాష్ట్రంలో అత్యధిక సీట్లను విపక్షాల కూటమి దక్కించుకుంటుందని రమేష్ అన్నారు.

త్వరలోనే సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఒక క్లారిటీ రాబోతోందని అన్నారు.రాయలసీమలోని కడప జిల్లాకు చెందిన రమేష్ చాలాకాలం టిడిపిలోనే ఉన్నారు.చంద్రబాబుకు( Chandrababu ) అత్యంత సన్నిహితుడు గాను ఆయనకు పేరు ఉంది.టిడిపిని వీడి బిజెపిలో చేరారు .ఇప్పుడు విశాఖ నుంచి పోటీ చేసేందుకు సీఎం రమేష్ ప్రయత్నాలు చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube