బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ మంచి జోష్ లో ఉన్నారు.ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ భారీ జన సందోహం మధ్య సక్సెస్ కావడం , జాతీయ నేతలు దీనికి హాజరు కావడం ఊహించని విధంగా జనాలు ఈ సభకు హాజరు కావడం, దేశవ్యాప్తంగా ఖమ్మం బీఆర్ఎస్ సభ గురించిన చర్చ జరుగుతూ ఉండడం తో తాము అనుకున్న లక్ష్యానికి చేరువవుతున్నామనే ఆనందం కేసీఆర్ లో బాగా కనిపిస్తోంది.
బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు లక్షల మంది జనాలు హాజరు కావడం పై ఈ సభకు హాజరైన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఇదే ఉత్సాహంతో మిగతా రాష్ట్రాల్లోనూ భారీ బహిరంగ సభలను నిర్వహించాలనే ప్లాన్ తో కెసిఆర్ ఉన్నారు.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ప్రభావాన్ని పెంచగలిగితే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని, అప్పుడు ఉత్తరాది పైన దృష్టి పెట్టవచ్చని కెసిఆర్ బలంగా నమ్ముతున్నారు.దీనిలో భాగంగానే ఖమ్మం సభ తరహాలో విశాఖలో బీఆర్ఎస్ సభను నిర్వహించాలని , దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు భారీగా చేపట్టాలని ఇప్పటికే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ ఆదేశించారు.
ఏపీవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ కు ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
విశాఖలో జరగబోయే సభకు మరికొంతమంది జాతీయ నేతలను ఆహ్వానించాలని, అలాగే ఈ సభలో మాజీ ఐఏఎస్ అధికారులను, జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన మేధావులను ఈ సభకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించి వారితో సందేశం ఇప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇక విశాఖ ముగిసిన తర్వాత కర్ణాటకలోనూ భారీ సభను నిర్వహించే ప్లాన్ లో ఉన్నారట.ఆ సభలోనే కర్ణాటక బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
కర్ణాటకలో జేడిఎస్ తో పొత్తు పెట్టుకునే ఆలోచనతో ఉండడంతో… సభ ఎక్కడ నిర్వహించాలి అనేది ఆ పార్టీ అధినేత కుమారస్వామి నిర్ణయానికి వదిలేయాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారట.ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు ఉన్న కర్ణాటక ప్రాంతంలో ఈ సభను నిర్వహించడం ద్వారా ఊహించని స్థాయిలో సవ సక్సెస్ అవుతుందని ప్లాన్ తో కెసిఆర్, కుమార స్వామి ఉన్నారట .ఇదేవిధంగా మిగతా రాష్ట్రాల్లోనూ భారీ సభలు నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు బిఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి.