ఏపీ సీఎం జగన్ రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా మదనపల్లెలో జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించిన నాలుగో త్రైమాసిక నిధులను ఆయన విడుదల చేయనున్నారు.
బీటీ కళాశాల మైదానంలోని హెలిపాడ్ లో దిగి ఇదే మార్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు.అనంతరం టిప్పు సుల్తాన్ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు.
కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.