కాకినాడ సభలో పవన్ పై సీఎం జగన్ సెటైర్లు..!!

వైయస్ జగన్ బస్సు యాత్ర కాకినాడ జిల్లాకు( Kakinada District ) చేరుకోవడం జరిగింది.ఈ క్రమంలో శుక్రవారం అచ్చంపేట జంక్షన్ లో నిర్వహించిన “మేమంత సిద్ధం” సభలో జగన్( Jagan ) ప్రసంగించారు.

 Cm Jagan Satires On Pawan In Kakinada Sabha Details, Cm Jagan, Pawan Kalyan, Ka-TeluguStop.com

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై సెటైర్లు వేశారు.పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) రాష్ట్రమంటే చులకనా అని అన్నారు.

జ్వరం వస్తే దత్త పుత్రుడు పిఠాపురం వదిలి హైదరాబాద్ పారిపోతాడు.ఎన్నికలలో ఎక్కడ నిలబడితే చంద్రబాబుకి( Chandrababu ) ప్రయోజనం చేకూరుతుందో అక్కడ పోటీ చేస్తారు.

దత్త పుత్రుడు ఎక్కడ పోటీ చేయాలనేది కూడా చంద్రబాబే నిర్ణయిస్తారు.బాబు సిట్ అంటే సిట్.జగన్ ని తిట్టు అంటే తిట్టు.గాజు గ్లాస్ తో తాగేది చంద్రబాబునే.దాన్ని శుభ్రం చేసి మళ్లీ చంద్రబాబుకు ఇచ్చేది ప్యాకేజీ స్టారే.బీఫామ్ ఎవరిదైనా యూనిఫాం చంద్రబాబుదే.

ఏ పార్టీలో ఉన్న.చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు.

కోవర్టుగా పురందేశ్వరి( Purandeshwari ) పనిచేస్తున్నారు.చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు.

అందుకే నాపై గులకరాలు వేయించారు.ఫ్యాన్ కి ఓటేస్తే ఆరోగ్యశ్రీ కొనసాగుతుంది.

కాపు నేస్తం కొనసాగుతోంది.గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఉంటాయి.

ఎవరు అధికారంలో ఉంటే మంచి జరుగుతుందో వారికే ఓటు వేయండి.అని సీఎం జగన్ కాకినాడ సభలో సంచలన స్పీచ్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube