ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలలో ఏది పెద్ద హిట్టో తేలిపోయిందిగా.. ఆ డైరెక్టర్ విన్నర్ అంటూ?

కేజీఎఫ్2 సినిమా విడుదలైన తర్వాత ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలలో పెద్ద హిట్ ఏదనే చర్చ జోరుగా జరిగింది.కొంతమంది ఆడియన్స్ ఆర్ఆర్ఆర్ సినిమాకు ఓటేస్తే మరి కొందరు ఆడియన్స్ కేజీఎఫ్2 సినిమాకు ఓటేశారు.కేజీఎఫ్2 విడుదలై రెండు వారాలు కావడంతో ఈ రెండు సినిమాలలో ఏ సినిమా పెద్ద హిట్ అనే ప్రశ్నకు జవాబు దొరికింది.తొలివారం కలెక్షన్లతో సంచలనాలు సృష్టించిన కేజీఎఫ్2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపడం లేదు.

 Clarity About Winner Between Rrr And Kgf2 Movies Details Here , Kgf2, Rrr, R-TeluguStop.com

గతంతో పోల్చి చూస్తే టికెట్ రేట్లు పెరగడం ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలకు ప్లస్ కాగా కేజీఎఫ్2 కలెక్షన్లు మాత్రం భారీగా తగ్గాయి.ఏపీలోని పలు ఏరియాలలో, కర్ణాటకలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు.

హిందీలో, ఓవర్సీస్ లో ఈ సినిమా అద్భుతంగా కలెక్షన్లను సాధించినా ఈ సినిమా టోటల్ కలెక్షన్లు 460 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలలో ఆర్ఆర్ఆర్ మూవీనే పెద్ద హిట్ గా నిలిచింది.

Telugu Alia Bhatt, Kgf, Prashanth Neel, Raja Mouli, Rajamouli, Ram Charan, Tolll

ఇద్దరు డైరెక్టర్లలో ఇప్పటికైతే రాజమౌళి విన్నర్ అని తేలిపోయింది.కేజీఎఫ్2 సినిమాకు ప్రమోషన్స్ లో వేగం పెంచి ఉంటే మాత్రం ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగేవని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అయితే ప్రశాంత్ నీల్ రూపంలో రాజమౌళికి గట్టి పోటీ దొరికిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అయితే రాజమౌళితో పోలిస్తే ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ తక్కువ కావడం గమనార్హం.

మరోవైపు కేజీఎఫ్3 సినిమాకు సంబంధించి వస్తున్న అప్ డేట్లు సైతం ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.ప్రశాంత్ నీల్ మరింత భారీగా ఈ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం అందుతోంది.

2025లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.మరోవైపు బాహుబలి2 సినిమాకు సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube