బాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్, దర్శకుడు గణేష్ ఆచార్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.స్టార్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న గణేష్ ఆచార్య ఏబీసీడీ సిరీస్ తో దర్శకుడుగా కూడా సత్తా చాటాడు.
అయితే బాలీవుడ్ లో ఎంత స్టార్ కొరియోగ్రాఫర్ గా ఉన్న అతని రూపం అతనికి మైనస్ అని చాలా మంది భావించేవారు.భారీకాయంతో ఉన్న గణేష్ ఆచార్య ఆ శరీరంతోనే డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేసి హీరోలతో స్టెప్పులు వేయించేవాడు.
అయితే కొద్ది రోజుల క్రితం హార్ట్ స్ట్రోక్ రావడంతో గణేష్ హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యాడు.ఇదిలా ఉంటే భారీకాయంతో ఉండే గణేష్ ఆచార్య పూర్తిగా తగ్గిపోయి స్లిమ్ లుక్ లోకి వచ్చేశాడు.
పెర్ఫెక్ట్ బాడీ షేప్ తో ఈ మధ్య కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
తాజాగా కపిల్ షోలో పాల్గొన్న గణేష్ తో ముచ్చటించే క్రమంలో అతను ఎన్ని కేజీల బరువు తగ్గాడు అనే విషయాన్ని రివీల్ చేశాడు.
అసలు మీరెన్ని కిలోలు బరువు తగ్గారు అని కపిల్ శర్మ అడగ్గా ఓ 98 కిలోలు తగ్గుంటానంటూ సమాధానమిచ్చాడు గణేష్.అంటే మీలో ఉన్న మరో ఇద్దరు మనుషులను చంపేసారన్నమాట అంటూ కామెడీ చేసాడు కపిల్ శర్మ.
ఈ వీడియోలతో పాటు ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే గణేష్ ఆచార్య చివరిగా తెలుగులో డీజే సినిమాలోని గుడిలో సాంగ్ కి డాన్స్ కంపోజ్ చేశారు.
ఏది ఏమైనా అంత భారీ శరీరాన్ని తగ్గించుకోవడం అనేది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.