2023 సంవత్సరంలోని బిగ్గెస్ట్ హిట్లలో దసరా ( Dussehra )మూవీ ఒకటనే సంగతి తెలిసిందే.నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఊరమాస్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.
అయితే ఈ డైరెక్టర్ తర్వాత ప్రాజెక్ట్ లో హీరో ఎవరనే ప్రశ్నకు చిరంజీవి( Chiranjeevi ) పేరు సమాధానంగా వినిపిస్తోంది.ఈ కాంబినేషన్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.
ఒకటి రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకులకు చిరంజీవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు.యంగ్, టాలెంటెడ్ డైరెక్టర్లను ఎంచుకోవడం వల్ల కొత్త తరహా కథలలో నటించే అవకాశం ఉండటంతో పాటు ఎక్కువ రెమ్యునరేషన్ అవసరం లేదనే సంగతి తెలిసిందే.
కథ నచ్చితే ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడానికి సైతం చిరంజీవి సిద్ధంగా ఉన్నారు.చిరంజీవి జాబితాలో ఇప్పటికే వెంకీ కుడుముల, వశిష్ట, కళ్యాణ్ కృష్ణ, ప్రసన్న కుమార్ బెజవాడ మరి కొందరు ఉన్నారు.
శ్రీకాంత్ ఓదెల ఇప్పటికే చిరంజీవికి లైన్ చెప్పగా ఆ లైన్ చిరంజీవిని ఆకట్టుకుందని తెలుస్తోంది.అయితే పూర్తి కథ నచ్చితే మాత్రమే ఛాన్స్ ఇస్తానని ఆయన చెప్పినట్టు బోగట్టా.ఈ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ సెట్ అయితే మాత్రం సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ ఉంది.దసరా మూవీ మెగాస్టార్ చిరంజీవికి తెగ నచ్చేసిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
చిరంజీవి ఊరమాస్ సినిమాలలో నటించినా ప్రేక్షకులు ఆదరిస్తారని ఇప్పటికే పలు సినిమాలతో ప్రూవ్ అయింది.చిరంజీవి శ్రీకాంత్ ఓదెల కాంబోలో సినిమా అధికారికంగా ఫిక్స్ అయితే మాత్రం ఆ సినిమా మామూలుగా ఉండదని చెప్పవచ్చు.
దసరా సక్సెస్ తో శ్రీకాంత్ ఓదెల పారితోషికం భారీ స్థాయిలోనే పెరిగిందని తెలుస్తోంది.భోళా శంకర్ రిలీజ్ తర్వాత చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారని బోగట్టా.