ప్రముఖ రచయితగా పాపులారిటీని సంపాదించుకున్న యండమూరి వీరేంద్రనాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరైతే పాపులర్ అవుతారో వాళ్లపై విమర్శలు సాధారణం అని తెలిపారు.కుక్క అనే సినిమా ఫస్ట్ పిక్చర్ అని 1,20,000 రూపాయలతో ఆ సినిమా తీశామని యండమూరి వెల్లడించారు.
అభిలాష స్క్రిప్ట్ లో నా ప్రమేయం ఉందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
నేను సినిమాలు ఎక్కువగా చూడటం లేదని యండమూరి పేర్కొన్నారు.
నేను చివరిగా స్క్రీన్ ప్లే వర్క్ చేసిన మూడు సినిమాలు సరిగ్గా ఆడలేదని ఆయన వెల్లడించారు.మృగరాజు, అనామిక, శక్తి సినిమాలు సరిగ్గా ఆడలేదని ఈ రీజన్ వల్లే సినిమా స్క్రీన్ ప్లే వర్క్ కు నన్ను ఎవరూ పిలవడం లేదని నేను కూడా వెళ్లడం లేదని యండమూరి వీరేంద్రనాథ్ కామెంట్లు చేయడం గమనార్హం.
చిరంజీవి, తారక్ సినిమాల ఫలితాల వల్లే ఇండస్ట్రీకి దూరమయ్యానని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు.
నాకు సైకాలజీపై అవగాహన ఉందని చాలామంది అనుకుంటారని విజయానికి ఐదు మెట్లు రాయడం వల్ల చాలామందికి అలాంటి అభిప్రాయం కలిగిందని ఆయన వెల్లడించారు.రాజకీయాల గురించి మాత్రం నన్ను అడగవద్దని యండమూరి చెప్పుకొచ్చారు.నా కెరీర్ లో ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదని ఆయన తెలిపారు.
ఈజీ మనీకి అలవాటుకు పడితే తర్వాత ఇబ్బంది పడతామని యండమూరి పేర్కొన్నారు.
లంచం తీసుకుంటే నరకానికి పోతామని నేను భావించనని ఆయన వెల్లడించారు.నోట్ల రద్దు తన దృష్టిలో మంచి నిర్ణయమేనని యండమూరి అన్నారు.అభిలాషకు 25,000 రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారని యండమూరి వెల్లడించారు.
అనామిక సినిమాకు నాకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ దక్కిందని ఆయన పేర్కొన్నారు.నేను సినిమాలను డైరెక్ట్ చేయలేదని నేను కేవలం స్క్రీన్ ప్లే మాత్రమే ఇచ్చానని యండమూరి వీరేంద్రనాథ్ వెల్లడించారు.
నేను దర్శకునిగా తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయని యండమూరి వీరేంద్రనాథ్ పేర్కొన్నారు.