Chiranjeevi : ఎవరికి ఇవ్వని ఆ ఒక్క వస్తువుని ఆ హీరోయిన్ కోసం ఇచ్చేసిన చిరంజీవి.. ఏంటో తెలుసా ?

ప్రస్తుతం ఇండస్ట్రీకే పెద్దన్నగా ఉన్న చిరంజీవి తాజాగా భోళా శంకర్ (Bhola shankar) సినిమాతో వచ్చినప్పటికీ ఆయన అభిమానులను ఆకట్టుకోలేకపోయారు.బోరింగ్ సన్నివేశాలు సినిమాకి మైనస్ అయ్యాయని చెప్పవచ్చు.

 Chiranjeevi Gave His Favorite Car To Heroine Ramyakrishna-TeluguStop.com

అంతేకాకుండా ఇంకొకసారి ఈ రీమేక్ లు చేయకండి అంటూ కొంతమంది నెటిజన్స్ మొత్తుకుంటున్నారు.కానీ చిరంజీవి (Chiranjeevi) రీమేక్ లతోనే స్టార్ హీరో అయ్యారు అనేది కొంతమంది వాదన.

ఇదంతా పక్కన పెడితే ఓ హీరోయిన్ కోసం చిరంజీవి ఎవరికి ఇవ్వని ఆ వస్తువుని ఇచ్చేశారట.

అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా.

చిరంజీవినీ ఒకప్పుడు హీరోయిన్ మాధవి (Madhavi) కారులో తన పక్కన కూర్చోవడానికి ఇష్టపడలేదట.ఇక ఆ అవమానంతో ఆయనకు మార్కెట్లోకి ఏ కొత్త కార్ వస్తే అది కొనుక్కొని తన రేంజెంటో నిరూపించుకున్నాడు.

అయితే అలాంటి చిరంజీవి అప్పట్లో మూడు కోట్లు పెట్టి ఒక ఖరీదైన స్టైలిష్ కారుని కొనుగోలు చేశారట.ఇక ఆ కారుని ఎవరు ముట్టుకున్నా కూడా అస్సలు ముట్టుకొనిచ్చేవారు కాదట.

మరీ ముఖ్యంగా చిన్న గీత పడ్డా కూడా వారిపై చిరంజీవి అరిచే వారట.

Telugu Bhola Shankar, Chiranjeevi, Chiranjeevi Car, Madhavi, Simha, Rajinikanth,

దాంతో పని వాళ్లు కూడా కారుపై చిన్న మరక కూడా పడకుండా చూసుకునేవారట.అయితే ఆ ఖరీదైన అలాగే చిరంజీవికి ఎంతో ఇష్టమైన కారుని రమ్యకృష్ణ (Ramyakrishna) కోసం ఇచ్చేసారట.అసలు విషయం ఏమిటంటే.

రమ్యకృష్ణ నరసింహ సినిమాలో ఒక స్టైలిష్ కారుతో ఎంట్రీ ఇచ్చిన సీన్ మీకు గుర్తుండే ఉంటుంది.అయితే ఆ సీన్ లో కనిపించింది చిరంజీవి కారేనట.

అయితే నరసింహ (Narasimha) సినిమాలో రమ్యకృష్ణ ఎంట్రీ వెరైటీగా స్టైలిష్ కారుతో ఉండాలి అని డైరెక్టర్ అనుకున్నారట.

Telugu Bhola Shankar, Chiranjeevi, Chiranjeevi Car, Madhavi, Simha, Rajinikanth,

దాంతో మార్కెట్లో ఉండే కార్లన్నీ వెతికినప్పటికీ ఏ ఒక్క కారు కూడా వారికి నచ్చలేదట.అయితే ఓసారి రమ్యకృష్ణ చిరంజీవి (Chiranjeevi) ఇంటికి పని మీద వెళ్ళినప్పుడు చిరంజీవి కారు చూసి చాలా బాగుంది మీ కారును మా షూటింగ్ కోసం ఇస్తారా అని అడిగితే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చిరంజీవి సరే తీసుకువెళ్ళు అని చెప్పారట.అలా చిరంజీవి తనకి ఎంతో ఇష్టమైన అలాగే ఎవరిని ముట్టుకోనివ్వని కారుని రమ్యకృష్ణ కోసం దాదాపు నెల రోజులపాటు ఇచ్చేశారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube