శంకర్, రామ్ చరణ్ కాంబో సినిమాపై మెగాస్టార్ కామెంట్స్

గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలు నిజం చేస్తూ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ మూవీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.దిల్ రాజు ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు.

 Chiranjeevi Feel Thrilling On Ram Charan Shankar Movie, Tollywood, Pan India Mov-TeluguStop.com

ఇక స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయిపొయింది.అయితే మల్టీ స్టారర్ చిత్రంగా ఉంటుందని అందరూ భావించిన కేవలం రామ్ చరణ్ తోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు దిల్ రాజు రిలీజ్ చేసిన పోస్టర్ బట్టి అర్ధమవుతుంది.

ఇప్పటి వరకు కేవలం డబ్బింగ్ సినిమాల ద్వారానే తెలుగు ప్రేక్షకులని పలకరించిన శంకర్ మొదటి సారి స్ట్రైట్ తెలుగు సినిమా తెరకెక్కించడానికి రెడీ కావడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. రామ్ చరణ్ తో శంకర్ లాంటి టాప్ దర్శకుడు సినిమా చేయడానికి ముందుకి రావడం, మెగాస్టార్ కి కూడా సాధ్యం కాని క్రెడిట్ ని ఇప్పుడు అతని తనయుడు సాధించడం గొప్ప విషయం అని చెప్పాలి.

ఈ నేపధ్యంలో శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ మూవీ గురించి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు.

క్రాఫ్ట్‌, విజ‌న‌రీ, స‌రిహ‌ద్దుల‌ను దాట‌డంలో మార్గ‌దర్శ‌కుడు శంక‌ర్‌తో రాంచ‌ర‌ణ్ సినిమా చేస్తుండ‌టం థ్రిల్ క‌లిగించే విష‌యం.

నీ వ‌రుస సినిమాలు భార‌త ఖ్యాతిని పెంచే ద‌ర్శ‌కుల‌తో చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.గుడ్‌లక్ అంటూ #RC15 #SVC50 హ్యాష్‌ట్యాగ్‌ల‌ను చిరంజీవి జోడించాడు.మొత్తానికి శంకర్ దర్శకత్వంలో తాను నటించలేకపోయాను అనే బాధ కంటే తన కొడుకు గ్రేట్ డైరెక్టర్ తో పని చేస్తున్నాడు అనే పుత్రోత్సాహం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి ఎక్కువ ఉంది.ప్రస్తుతం ఇండియన్ టాప్ డైరెక్టర్ గా ఉన్న రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ మళ్ళీ వెంటనే గ్రేట్ డైరెక్టర్ శంకర్ తో మూవీ చేసే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోవడం నిజంగా గొప్ప విషయమని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube