నా అఛీవ్ మెంట్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజాగా అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్( American Progressive Telugu Association ) ఆధ్వర్యంలో హైటెక్స్‌ లో నిర్వహించిన క్యాటలిస్ట్‌ గ్లోబల్‌ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌-2025 ( Global Business Conference-2025 )కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిరంజీవి.ఈ సందర్భంగా ఆ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ అలనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.

 Chiranjeevi About His Achievements, Chiranjeevi, Achievements, Tollywood, Ram Ch-TeluguStop.com

అప్పుడప్పుడు పాండి బజార్‌ వెళ్లినప్పుడు అప్పటికే అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు నన్ను నిరుత్సాహపరిచేవారు. ఆంజనేయ స్వామికి చెప్పుకొనేవాడిని.

నెగెటివిటీ ఉన్న చోటికి నిన్ను ఎవరు వెళ్లమన్నారు? పాజిటివ్‌గా ఉంటూ విజయం సాధించు అని ఆయన నాకు చెప్పినట్టు అనిపించేది.

Telugu Chiranjeevi, Pawan Kalyan, Ram Charan, Tollywood-Movie

సినిమాల్లో నెంబరు 1 అవ్వాలని ఫిక్స్‌ అయ్యాను.ఆ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను.లక్ష్యాన్నే తప్ప మిగిలిన వాటిని పట్టించుకోలేదు అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ).అనంతరం పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ల గురించి మాట్లాడుతూ.నా అఛీవ్‌మెంట్‌ పవన్‌ కల్యాణ్‌, నా అఛీవ్‌మెంట్‌ రామ్‌చరణ్‌ , మా కుటుంబంలో అందరూ నా అఛీవ్‌మెంట్సే.

వాళ్లను చూస్తుంటే ఇది కదా నేను సాధించింది అనిపిస్తుంది.ఇటీవల పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు.

Telugu Chiranjeevi, Pawan Kalyan, Ram Charan, Tollywood-Movie

అన్నయ్య నువ్వు ఒక మాట అనేవాడివి గుర్తుందా, మన ఇంట్లో ఇంతమంది ఉన్నందుకు, ఇది నాతో ఆగిపోకూడదు.ఒక రాజ్‌ కపూర్‌ ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారో, అలాగే మరో రాజ్‌ కపూర్‌ ఫ్యామిలీగా మన మెగా కుటుంబం కావాలి అని నువ్వు చెప్పావు.ఈ రోజు నీ మాట మంత్రంగా పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నాం.అది నీ మాట పవర్‌ అని కల్యాణ్‌ బాబు ఈ మధ్యనే అన్నాడు అని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగానే త్వరలోనే విశ్వంభర అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube