దోమలను మట్టుపెట్టేందుకు మెషీన్ గన్ తయారీ.. చైనీయుల తెలివి

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో రకాల వైరల్ వీడియోలు మనం చూస్తూనే ఉంటాం.ఇందులో భాగంగానే తాజాగా చైనా ఇంజనీర్ కనిపెట్టిన దోమల మిషన్( Mosquito Machine ) సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

 China Engineer Came Up With Anti-mosquito Air Defense Video Viral Details, China-TeluguStop.com

నిజానికి మనుషులు ఎవరికైనా హాని చేయకపోయినా వారికి మాత్రం హాని చేసే ఏకైక జీవి మాత్రం దోమనే అని చెప్పాలి.దోమల కాయిల్స్, ఆలవుట్, దోమల బ్యాట్స్ ఇలా ఎన్ని మన చుట్టూ ఉన్న చివరికి మన శ్రమ వృధా కావాల్సిందే తప్పించి దోమలు మాత్రం వాటి నుంచి దూరంగా ఉండకుండా పోవు.

అయితే ఓ చైనా ఇంజనీర్( Chinese Engineer ) దీనికి ఎలాగైనా శాశ్వత సమస్య కనిపెట్టాలని అనుకున్నాడో ఏమో కానీ.ఏకంగా ఓ మిషన్ కనిపెట్టేసాడు.

ఇందుకు సంబంధించి పూర్తి విరాళాలకు వెళితే.దోమలను చంపేందుకు చిన్న సైజు యుద్ధ ట్యాంక్ మాదిరి లాగే కనబడే ఓ యంత్రాన్ని కనిపెట్టేసాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే సదరు చైనా ఇంజనీర్ కనిపెట్టిన యంత్రం లేజర్ ఉపయోగించి( Laser ) దోమల్ని చంపే విధంగా రూపొందించాడు.

ముందుగా దోమల కదలికను ట్రాక్ చేసేందుకు ఓ డివైస్ ను మిషన్ కు అనుసంధానం చేశాడు.ఇక ఆ రాడార్ దోమల కదలికలను ట్రాక్ చేసి ఆ సమాచారాన్ని యంత్రంకి పంపించి అందులో ఉన్న యంత్రం వాటిని విశ్లేషించి, ఆ తర్వాత లేజర్ గన్నును( Laser Gun ) దోమలపై గురిపెట్టి చివరిగా లేజర్ సహాయంతో దోమలను అంతమందిస్తోంది.

ఇకపోతే ఆ ఇంజనీర్ ఈ మిషన్ తో చంపబడిన దోమల్ని ఓ స్క్రాప్ బుక్ లో లెక్కగడుతూ ఔరా అనిపిస్తున్నాడు.ఈ పరికరం పని చూసిన జనాలు కూడా ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు.ఈ వీడియోని చూసిన నెటిజన్స్ వారికి తగ్గట్టుగా కామెంట్స్ రూపంలో వివిధ కామెంట్స్ జత చేస్తున్నారు.ఒకరేమో ఇదంతా కేవలం ఫేమస్ కావడానికి అని కామెంట్ చేస్తుంటే మరికొందరు మీ ప్రయత్నం సూపరో సూపర్.

అంటూ ఆ ఇంజనీర్ ని తెగ పొగిడేస్తున్నారు.మరికొందరేమో దోమల్ని చంపి ఇలా రికార్డు మైంటైన్ చేయడం నిజంగా ఉన్మాదము అంటూ ఆగ్రహం చేసేవారు కూడా లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube