అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చిరుతల సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.పట్టణ శివారులోని వెంగమాంబ గోశాలలో రెండు చిరుత పులులు చొరబడ్డాయి.
ఈ క్రమంలోనే గోవులపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి.చిరుతల రాకను గమనించి గోశాల సంరక్షకులు దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పులులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
అదే సమయంలో కల్యాణదుర్గం పోలీసులు అటుగా వచ్చారు.ఈ నేపథ్యంలో సంరక్షులతో పాటు పోలీసులు కూడా గోశాలకు సుమారు రెండు గంటల పాటు పహారా నిర్వహించారు.
అయితే చిరుతలు మళ్లీ వచ్చే అవకాశం ఉండటంతో గోశాల సంరక్షులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.