దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకుల కొదవేలేదు.పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారు, చంద్రబాబు టిడిపి అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత నుంచీ ఆయన వెంట నడుస్తున్న వారు చాలా మంది ఉన్నారు.
వారంతా టిడిపి క్లిష్టపరిస్థితులు ఎదర్కొంటున్న సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు.ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.అయితే వారంతా ప్రజా బలం కోల్పోవడం, వరుస ఓటములు ఎదుర్కోవడం, ప్రజాక్షేత్రంలో బలం పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయకపోవడం వంటి కారణాలతో,వరుస ఎన్నికల్లో వారు ఓటమి చెందుతూ వస్తున్నారు.
2024 ఎన్నికల్లో వారికి టికెట్లు ఇచ్చినా గెలిచే అవకాశమే లేదు అనే అభిప్రాయం టిడిపి అధినేత చంద్రబాబు లో ఉంది.పార్టీ సీనియర్ నేతలను కేవలం పార్టీ సేవల వరకు మాత్రమే పరిమితం చేయాలని, రాబోయే ఎన్నికల్లో యువ నేతలకు, గెలుపు గుర్రాలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.అంతే కాకుండా వరుసగా రెండు ఎన్నికల్లోనూ వాటిని చెందుతూ వస్తున్న సీనియర్ నాయకులను పక్కన పెట్టాలని , వారి స్థానంలో వారి వారసులకు కానీ, ప్రజా బలం ఉన్న యువ నేతలకు, గెలుస్తారు అనుకునే యువ నేతలకు టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.
ఈ విషయంలో అనవసర మొహమాటం పక్కనపెట్టి క్లారిటీ గా ముందుకు వెళ్లాలనే ప్లాన్ లో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.
వైసిపి విషయానికి వస్తే ఆ పార్టీ 2019 ఎన్నికల్లో చాలా చోట్ల యువ నాయకులకు అవకాశం ఇచ్చారు.వారిలో దాదాపు చాలా మంది విజయం సాధించారు.ఇప్పుడు టిడిపి కూడా అదే ఫార్ములాను ఉపయోగించి, రాబోయే ఎన్నికల్లో గట్టెక్కాలనే ప్లాన్ లో ఉంది.
ఇప్పటికే టిడిపి సీనియర్ నాయకుల వారసులు చాలామంది పార్టీలో యాక్టివ్ అయ్యారు.రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారు ఇప్పటి నుంచే ప్రజలలో తిరుగుతూ తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పుడు యువ నాయకులకు టికెట్ ఇచ్చినా, సీనియర్ నాయకుల నుంచి పెద్దగా అభ్యంతరం ఉండదని, దాదాపు చాలామంది రాజకీయాల నుంచి రిటైర్డ్ అవ్వాలనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో తమ వ్యూహం పని చేస్తుందని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారట.