ఎముకల బలహీనతకు చెక్ పెట్టే పొద్దుతిరుగుడు గింజలు.‌. ఇలా రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

పొద్దుతిరుగుడు( Sunflower seeds ) గింజలు.వీటి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.

 Consuming Sunflower Seeds Like This Has Many Health Benefits! Sunflower Seeds La-TeluguStop.com

మనదేశంలో చాలా మంది ఈ గింజల నుంచి తయారయ్యే ఆయిల్ ను వాడుతుంటారు.అయితే ఆయిల్ గురించి పక్కన పెడితే పొద్దుతిరుగుడు గింజలతో బోలెడు ఆరోగ్య లాభాలు ఉన్నాయి.

పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ బి, విటమిన్ ఇ, ఐరన్, కాపర్, జింక్, సెలీనియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు మెండుగా నిండి ఉంటాయి.అందువల్ల వీటిని డైట్ లో చేర్చుకుంటే హెల్త్ పరంగా అపారమైన ప్రయోజనాలు పొందవచ్చు.

Telugu Anemia, Tips, Latest, Sunflower Seeds, Sunflowerseeds-Telugu Health

అయితే చాలామంది వీటిని నేరుగా తినలేరు.అలాంటివారు ఇప్పుడు చెప్పబోయే విధంగా లడ్డూలు తయారు చేసుకుని రోజు తీసుకోవచ్చు.అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని రెండు కప్పులు పొద్దుతిరుగుడు గింజలు వేసుకుని దోరగా వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు వేపుడు శనగపప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పొద్దు తిరుగుడు గింజలు, శనగపప్పు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత అందులో ఒక కప్పు బెల్లం తురుము( Jaggery ), హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఇందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి.ఈ లడ్డూలను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ స్టోర్ చేసుకోవాలి.

రోజుకు ఒకటి చొప్పున ప్రతిరోజు ఈ లడ్డూలను తీసుకోవాలి.ఎముకల బలహీనతకు చెక్ పెట్టేందుకు ఈ లడ్డూ అద్భుతంగా సహాయపడుతుంది.

Telugu Anemia, Tips, Latest, Sunflower Seeds, Sunflowerseeds-Telugu Health

రోజు ఈ లడ్డూను తీసుకుంటే ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది.బోన్స్‌ దృఢంగా గట్టిగా మారుతాయి.మోకాళ్ళ నొప్పులు( Knee Pains ) ఉంటే దూరం అవుతాయి.అంతేకాదు ఈ లడ్డూలను రెగ్యులర్ గా తింటే శరీరానికి అవసరమయ్యే ఐరన్ అందుతుంది.రక్త వృద్ధి జరుగుతుంది.నీరసం అలసట వంటివి వేధించకుండా ఉంటాయి.

రక్తపోటు అదుపులో ఉంటుంది.నరాల వీక్ నెస్ సమస్య ఉంటే దూరం అవుతుంది.

మరియు హెయిర్ ఫాల్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube