చంద్రముఖి 2 టీమ్ కి లెటర్ రాసిన రజినీకాంత్... ఏం జరిగిందంటే?

డైరెక్టర్ పి వాసు దర్శకత్వంలో రజనీకాంత్ జ్యోతిక హీరో హీరోయిన్లుగా 2005వ సంవత్సరంలో నటించిన చిత్రం చంద్రముఖి.ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.

 Rajinikanth Surprise Note For Raghava Lawrence Chandramukhi 2 Team , Rajinikanth-TeluguStop.com

ఇలా ఈ సినిమాలో రజనీకాంత్(Rajinikanth ) హీరోగా నటించగా చంద్రముఖి పాత్రలో జ్యోతిక(Jyothika ) ఎంతో అద్భుతంగా నటించారు.అయితే ఈ సినిమా విడుదలైనటువంటి దాదాపు 17 సంవత్సరాలకు ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

ఇక ఈ సీక్వెల్ చిత్రంలో రజనీకాంత్ పాత్రలో రాఘవ లారెన్స్(Raghava Lawrence) నటించగా జ్యోతిక పాత్రలో బాలీవుడ్ నటి కంగనా(Kangana )నటించారు.

ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇలా విడుదలైనటువంటి ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో రజనీకాంత్ చిత్ర బృందాన్ని ఉద్దేశిస్తూ ఒక స్పెషల్ నోట్ రాశారు.రజనీకాంత్ రాసినటువంటి ఈ లెటర్ ను లైకా సమస్థ( Lyca Productions ) వారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ లెటర్ లో రజనీకాంత్ ఏమని రాశారు అనే విషయానికి వస్తే.నా మిత్రుడు పి వాసు తన బిగ్గెస్ట్ హిట్ చంద్రముఖి సినిమాని కొత్త యాంగిల్ లో భారీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా సినీ అభిమానులకు చంద్రముఖి 2 ద్వారా అందించాడు.

వాసు గారికి, రాఘవ లారెన్స్ గారికి, చిత్రబృందం అందరికీ నా శుభాకాంక్షలు అంటూ ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ లేఖ రాశారు.

ఈ విధంగా రజనీకాంత్ గారి నుంచి సర్ప్రైసింగ్ లెటర్ అందడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇక రజనీకాంత్ రాసిన ఈ లెటర్ ను లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించాడు.ఆస్కార్‌ అవార్డు గ్ర‌హీత ఎంఎం కీర‌వాణి ఈ సినిమాకి సంగీతం అందించారు.

అయితే కొన్నిచోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాగా మరికొన్ని చోట్ల మాత్రం ఈ సినిమాపై భారీ స్థాయిలోనే విమర్శలు వస్తున్నాయి.చంద్రముఖి సినిమాని టైటిల్ మార్చి అలాగే తారాగణం మార్చి చంద్రముఖి 2 సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అంటూ మరికొన్ని చోట్ల విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube