స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆయనపై నమోదైన మరో మూడు కేసులలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
చంద్రబాబుపై నమోదైన మూడు కేసుల నేపథ్యంలో న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం, అంగళ్లు అల్లర్ల కేసుతో పాటు విజయనగరంలో చంద్రబాబుపై కేసులు నమోదు అయ్యాయని తెలుస్తోంది.
ఈ మేరకు కేసులలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు వేశారని సమాచారం.ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్లు గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.