ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఆల్రెడీ ఏపీలో జనసేన( Janasena ) మరియు తెలుగుదేశం పార్టీ( TDP ) పొత్తు పెట్టుకోవడం తెలిసిందే.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ కావడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటు గురించి చర్చించినట్లు సమాచారం.
2024 ఎన్నికలలో తెలుగుదేశం.జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో పలుమార్లు పవన్ కళ్యాణ్.( Pawan Kalyan ) టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లి సమావేశమైన సందర్భాలు ఉన్నాయి.
అయితే తాజాగా ఆదివారం సాయంత్రం చంద్రబాబు( Chandrababu Naidu ) హైదరాబాదులో పవన్ ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు.వీరిద్దరి భేటీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.వైసీపీ పార్టీని గద్దె దించాలని.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా.
పొత్తు పెట్టుకున్నట్లు పవన్ కళ్యాణ్.గతంలో స్పష్టం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేయడం.అంతేకాదు దాదాపు పది సంవత్సరాలు పాటు తెలుగుదేశంతో కలిసి నడుస్తున్నట్లు ఇటీవల.
పార్టీ కార్యాలయంలో తెలియజేయడం జరిగింది.