ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ లో రేగుతున్న ఆధిపత్య పోరు పతాకా స్థాయికి చేరుకుంటోంది.ఎక్కడికక్కడ అసంతృప్తి సెగలు ఉన్నా చాలా చోట్ల పార్టీ పరువు పోతుందని సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు నేతలు.
కాని కొంతమంది ఎమ్మెల్యేల ఆధిపత్య పోరుని తట్టుకోలేక, ఎంతో మంది ఆవేదన చెందుతున్నారు.అయితే రెండు రోజుల క్రితం జరిగిన పశ్చిమ గోదావారి జిల్లా పాలకొల్లు లోని ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ వార్ ఎంతటి సంచలనం కలిగించిదే కూడా అందరికి తెలుసు అయితే నిన్నటి రోజున ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు కి మద్దతుగా ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలు కార్తీక వన సమారాధన లో ఎమ్మెల్యే పై సదరు ఎమ్మెల్యే పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలకొల్లు పరిసర ప్రాంతంలో బలమైన బీసీ నేతగా ఉన్న మా అంగరని స్థానిక ఎమ్మెల్యే నోటికి వచ్చినట్లు మాట్లాడటం శెట్టిబలిజ వర్గానికి చెందిన బీసీలుగా మేము తట్టుకోల్క పోతున్నామని.పాలకొల్లు లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని బీసీ నేతలు అందరూ గంగారకి చెప్పడం జరిగింది అయితే ఈ క్రమంలో అంగర పార్టీ పరువు పోయే విధంగా ఏమి చేయవద్దని ఇన్నేళ్ళు పార్టీలో ఉన్నా ఒక్క మాటకూడా పడలేదని కాని ఒక ఎమ్మెల్యే ఆయన స్థాయిని మరిచి మరీ ఎంతో సీనియర్ నేత అయిన నన్ను అలా దూషించడం విచారకరమని త్వరలో ఆయనపై ఫిర్యాదుకు చంద్రబాబు వద్దకు వెళ్తానని ఆయన ప్రకటించారు.దాంతో
పాలకొల్లు రాజకీయం ఎంతో రాసవత్తరంగా మారిపోయింది.ఈ ఎఫెక్ట్ డెల్టాలో ఉన్న బీసీ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలుస్తోంది.ఎందుకంటే డెల్టాలో అంగర సామాజిక వర్గం అయిన శెట్టి బలిజ అంటే అత్యధికంగా ఉన్న వర్గాలు అంతేకాదు తూర్పు గోదావరి జిల్లాలో సైతం ఈ వర్గానికి ఎంతో బలముంది.అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీగా ఉన్న తరుణంలో ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల ప్రభావానికి పార్టీలకు అతీతంగా బీసీలు అందరూ ఏకం అయ్యే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.

అయితే అంగర తన సామాజిక వర్గం ఏర్పాటు చేసిన వనసమారాధాన లో మాట్లాడుతూ చంద్రబాబు ని త్వరలో కలుస్తానని.రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని ప్రకటించడం డెల్టాలో మరింత కాక రేపుతోంది దాంతో ఇప్పుడు చంద్రబాబు అంగర భేటీ పై తీవ్ర ఉత్ఖంట రేగుతోంది.అయితే ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు సదరు ఎమ్మెల్యే పై గుర్రుగా ఉన్నారట కూడా.గతంలో కూడా పాలకొల్లు లో బీసీ వర్గాలకి చెందిన పలువురు వ్యక్తులని నేతలు ఇబ్బందులకి గురిచేసిన విషయాలు సైతం చంద్రబాబు ముంగిట ఉన్నాయని.
వచ్చే ఎన్నికల్లో సదరు ఎమ్మెల్యే కి టిక్కట్టు ఇచ్చే విషయంలో ఈ విషయాలు అన్నీ తీవ్రమైన ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు పార్టీ సీనియర్స్.