టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది.ఆయన హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరణకు గురైంది.
ఈ మేరకు హౌస్ రిమాండ్ పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది.
అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసుపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.అయితే చంద్రబాబుకు ప్రాణహాని ఉందని, ఈ క్రమంలో ఆయనకు హౌస్ రిమాండ్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కానీ చంద్రబాబుకు సెంట్రల్ జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో పాటు కట్టుదిట్టమైన భద్రత కల్పించామని సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.ఈ నేపథ్యంలో సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను కొట్టివేసింది.