తెలంగాణలో రాజకీయ సంక్షోభం తీసుకురావాలని చూస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.సరైన సమయంలో ఎన్నికలు జరగాలని భావిస్తున్నట్లు తెలిపారు.
బీజేపీ దేనికి భయపడదన్నారు.ప్రజాస్వామ్యం ప్రకారం నడుచుకునే పార్టీ తమదని పేర్కొన్నారు.
కేసీఆర్ కుటుంబం అభద్రతా భావంలో ఉందని వెల్లడించారు.కేసీఆర్ సానుభూతి కోసం రోజుకో తప్పు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలపై తమకు విశ్వాసం ఉందని చెప్పారు.ఆ విశ్వాసంతోనే ముందుకెళ్తామన్న ఆయన అసెంబ్లీ ఎన్నికలపై తమకు తొందర లేదని స్పష్టం చేశారు.