ఏపీ అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసుకుని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) సంచలన ఆరోపణలు చేశారు.ఏపీలో పశువుల స్కాం జరిగిందని, 2,850 కోట్ల రూపాయలు దోచేసారని నాదెండ్ల విమర్శించారు.
గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన నాదెండ్ల పశువుల స్కాంకు సంబంధించి ఎన్నో విషయాలను ప్రస్తావించారు.మహిళా సాధికారత కోసం ప్రభుత్వం దిగివచ్చిందని ఊదరగొడుతున్నారని , క్షేత్రస్థాయిలో 3.85 లక్షల పశువులు కనిపించడం లేదని , 4.75 లక్షల పాడిపశువులు కొనడానికి క్యాబినెట్ తీర్మానం చేసిందని, మార్చి 2న శాసనసభలో మంత్రి మాట్లాడుతూ 3.2 లక్షల పశువులను కొనుగోలు చేయించామని తెలిపారని , ఒక రోజులోనే 1.20 లక్షలు వసూలు కొనుగోలు చేసినట్లు తెలిపారని, 2 లక్షల పశువులను కొన్నట్లు అధికారులు తెలిపారని, కానీ క్షేత్రస్థాయిలో ఎనిమిది వేల పశువులు మాత్రమే కొన్నారని 2887 కోట్ల రూపాయల స్కాంకు వైసిపి నేతలు పాల్పడ్డారని నాదెండ్ల మనోహర్ సంచలన విమర్శలు చేశారు.
సామాన్యులకు ఏమాత్రం అర్థం కాకుండా ఈ దోపిడీ జరిగిందని, పశువుల కొనుగోలుపై 2,850 కోట్ల అవినీతిని వైసీపీ నేతలు చేశారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు .అంతేకాదు , పశువుల స్కాం ను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని అనుమానాలు తమకు ఉన్నాయని నాదెండ్ల మనోహర్ అన్నారు.ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టబోమని , జనాల్లోకి తీసుకువెళ్తామని నాదెండ్ల వ్యాఖ్యానించారు .
ఇప్పటికే జనసేన ను , టిడిపిని టార్గెట్ చేసుకుని వైసిపి అనేక విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా జనసేనకు అక్రమార్గంలో నిధులు హవాలా ద్వారా వస్తున్నాయని వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్న క్రమంలోనే నాదెండ్ల మనోహర్ పశువుల స్కాం కు సంబందించి అనే సంచలన విషయాలు బయట పెట్టడంతో, ఈ వ్యవహారంపై జనసేన వైసిపి మధ్య విమర్శల దాడి మ్రింత తీవ్రతరం అయ్యేలా కనిపిస్తుంది.