సోషల్ మీడియా( Social media )లో ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్నిటిని చూసినపుడు చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది.
మరికొన్నిటిని చూసినపుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది.అసలు ఇలా ఎలా? అనే అనుమానం కలుగుతూ ఉంటుంది.తాజాగా అటువంటి రకానికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.దానిని చూస్తే మీకు ఈ మూడు రకాల ఫీలింగ్స్ ఒకేసారి కలుగుతాయి అనడంలో అతిశయోక్తి కాదు.
ఈ ప్రపంచంలోని జనాలకి ఇష్టమైన పెట్స్ రెండే రెండు.ఒకటి కుక్కలైతే రెండవది పిల్లులు( Cats ) మనదేశంలో తక్కువకానీ, విదేశాల్లో పిల్లులను విరివిగా పెంచుతూ వుంటారు.ఇక పిల్లులు డాన్స్ వేయడం ఎపుడైనా చూసారా? చూడకపోతే ఒకసారి ఇక్కడ వీడియో చూడండి.ఇక వైరల్ వీడియోలోకి వెళ్ళిపోతే, తాజాగా ఓ పిల్లి తన కాలుతో డాన్స్ చేయడమే కాకుండా నడుమును కూడా వయ్యారంగా ఊపుతూ నాట్యం చేసింది.
అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం పెట్ లవర్స్‌ని కనువిందు చేస్తోంది.
తన ఓనర్ సహాయంతో రెండు కాళ్లపై నిలబడిన ఆ పిల్లి చక్కగా నడుము ఊపుతూ అమ్మాయిల మాదిరి బెల్లీ డ్యాన్స్ చేస్తోంది.ఆ డ్యాన్స్ చేయడం కోసం పిల్లికి చక్కని దుస్తులు కూడా వేశారు.కాగా వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఈ పిల్లి బెల్లీ డాన్సు( Belly dance ) ముందు బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా దిగదుడుపే అని కొందరు కామెంట్ చేస్తే, ఈ పిల్లికి నూట పదహార్లు చదివించినా తక్కువే అవుతుందని ఓ ఔత్సాహికుడు కామెంట్ చేసాడు.మరోవైపు ఈ వీడియోకు 20 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.