కర్ణాటకలో రేషన్ పంపిణీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అన్న భాగ్య పథకంలో బియ్యం బదులు నగదు ఇవ్వాలని నిర్ణయించిందని తెలుస్తోంది.కిలో బియ్యానికి రూ.34 చొప్పున నగదు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.బీపీఎల్ కుటుంబాలకు పది కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే బియ్యం కొరతతో నగదు ఇవ్వనుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
బియ్యం అందుబాటులోకి వచ్చే వరకు ప్రజలకు నగదు అందజేయనుంది.