హైదరాబాద్ లోని నాంపల్లిలో జరిగిన చార్మినార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై కేసు నమోదు అయింది.ఈ మేరకు నాంపల్లి స్టేషన్ మాస్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పటికే లోకో ఫైలెట్ ను రైల్వే పోలీసులు విచారిస్తున్నారు.మరోవైపు బోగీల పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రమాద ఘటనపై ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.అయితే చార్మినార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వెనక్కి తీస్తుండగా చోటు చేసుకున్న ప్రమాదంలో మూడు బోగీలు పక్కకు తప్పాయి.
అలాగే ఈ ఘటనలో మొత్తం యాభై మంది గాయపడ్డారు.