పెళ్లి.ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన క్షణం.ముఖ్యంగా ఆడవారికి పెళ్లి ఎంతో స్పెషల్.ఎంగేజ్‌మెంట్, ఫోటో షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్, వెడ్డింగ్ షూట్, షాపింగ్, పెళ్లి బరాత్, రిసెప్షన్ ఇలా అనేక కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంటారు.
పెళ్లి కూతురిగా ముస్తాబవ్వాలని ఆడపిల్లలకు చిన్నప్పటి నుంచి ఎంతో ఆశ ఉంటుంది.బంధువులు, సన్నిహితులు, స్నేహితులతో పెళ్లి వేడుకలు అంబరాన్ని అంటుతాయి.
పెళ్లిలో ఎంత పనుంటుందో.అక్కడక్కడ సంభవించే కొన్ని సన్నివేశాలు ఎంతే ఫన్నీగా అనిపిస్తాయి.
పెళ్లి వేడుకల్లోనే ఎక్కువ ఫన్నీ ఇన్నిడెంట్స్ నమోదవుతుంటాయి.వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
పెళ్లిలో పెళ్లి కొడుకు అలసి.పెళ్లి కూతురిని కొట్టడం.
పెళ్లిలో చిరాకు పడుతూ ఉండటం వంటి ఇన్సిడెంట్స్ నమోదవుతుంటాయి.అలాగే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్న పెళ్లి కూతురు కూడా పెళ్లి కొడుకుపై ఓ రేంజ్‌లో రివేంజ్ తీసుకుంటుంది.
పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుకు వివాహం ఇష్టమున్నా.బంధువుల వల్ల తలెత్తే కొన్ని ఘటనలు నవ్వులను పూయిస్తాయి.
ఇలాంటి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి.సాధారణ వీడియోల కన్నా.పెళ్లి సమయంలో జరిగే కొన్ని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చెంప చెళ్లుమనిపించడం, లేదా పెళ్లికొడుకు పెళ్లి కూతురి చెంప చెళ్లుమనిపించడం, వీరిద్దరూ కలిసి వేరే వాళ్ల చెంప చెళ్లుమనిపించడం ఇలా పలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి ఫన్నీ వీడియోలను ఓ వ్యక్తి తన ‘చైత్రా ఫిల్మ్స్ భోజ్‌పూరి’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాడు.అయితే పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలను ఒకే దగ్గర యాడ్ చేసి పోస్ట్ చేశాడు.ఈ వీడియోకు 4.8 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి.