నేను వాళ్ళను మాత్రమే మోసం చేశాను... మీడియాకు లేఖ రాసిన పూరి జగన్నాథ్!

డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.ఈయన పాన్ ఇండియా స్థాయిలో చేసిన లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూటర్లు తమ డబ్బు తమకు వెనక్కి చెల్లించాలంటూ పెద్ద ఎత్తున ఈయనపై ఒత్తిడి తీసుకురావడంతో ఈ విషయం కాస్త వివాదంగా మారింది.

 Puri Jagannadh’s Letter To Media Goes Viralpuri Jagannadh’s Letter To Medi-TeluguStop.com

ఈ క్రమంలోనే కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈయనను బెదిరించడం ఈయన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.ఇకపోతే తాజాగా అభిమానులను ఉద్దేశిస్తూ పూరి జగన్నాథ్ మీడియాకు రాసినటువంటి ఒక లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా ఈయన లేఖ రాస్తూ.జీవితంలో సక్సెస్ ఫెయిల్యూర్ ఈ రెండు పూర్తిగా వ్యతిరేకం అనుకుంటాం కానీ ఇవి రెండు మన జీవితంలో ఫ్లో అవుతూ ఉంటాయి ఒకసారి సక్సెస్ అవుతే మరోసారి ఫెయిల్యూర్ తప్పకుండా వస్తుంది.

మనం గట్టిగా ఊపిరి పీల్చుకుంటాం తిరిగి చేయాల్సిన పని వదిలేయటం.పడతాం లేస్తాం నవ్వుతాం తర్వాత ఏడుస్తాం ఇవన్నీ మన జీవితంలో సర్వసాధారణంగా జరిగేవి.ఇక్కడ ఏది పర్మినెంట్ కాదు అంటూ ఈయన జీవితంలో వచ్చే సక్సెస్ ఫెయిల్యూర్స్ గురించి పెద్ద ఎత్తున లేఖ రాస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.

Telugu Buyers, Liger, Puri Jagannadh-Movie

మనం ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా.ఎవరిని మోసం చేయకుండా మన పని మనం చూసుకుంటూ వెళ్తే మనల్ని పీకే వాళ్ళు ఎవరూ లేరు.నేను నా జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా మోసం దగా చేశాను అంటే అది కేవలం ప్రేక్షకులను మాత్రమే.

వారు నా సినిమాపై నమ్మకం పెట్టుకుని టికెట్ కొని సినిమాకు వచ్చారు.ఆ సినిమా డిజాస్టర్ అయింది అంటే నేను ప్రేక్షకులను మాత్రమే మోసం చేసినట్టు.ఈ విషయంలో వారి పట్ల నేను బాధ్యత వహించి మరొక సినిమా తీసి వారిని ఎంటర్టైన్ చేస్తాను.ఇక డబ్బు విషయానికి వస్తే చచ్చిన తర్వాత ఒక్క రూపాయి వెంట తీసుకువెళ్లాడు అనే వారి పేరు నాకు చెప్పండి నేను కూడా డబ్బును పోగు చేస్తాను.

చివరికి మనమందరం కలిసేది స్మశానంలోనే ఈ మధ్యలో జరిగేదంతా ఒక డ్రామా మాత్రమే… మీ పూరి జగన్నాథ్ అంటూ పెద్ద ఎత్తున మీడియాకు లేఖ రాయడంతో ఈ లేఖ కాస్త వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube