జీవితంలో కొన్ని సందర్భాలు నిజ జీవితంలో జరిగినా కానీ అవి సినిమా చూపించినట్లు అనిపిస్తుంటాయని రచయిత, దర్శకుడు, నటుడు ఎల్బీ శ్రీరాం వెల్లడించారు.ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రియల్ లైఫ్ లో జరిగిన ఓ సంఘటన.
చిరంజీవి చెల్లెలి అప్పగింతల సీన్ ని గుర్తు తెచ్చిందని ఎల్బీ శ్రీరాం తెలిపారు.
తన కూతురికి హైదరాబాద్ లోనే ఒక మంచి సంబంధం చూశానని, ఎంతో ఘనంగా పెళ్లి చేశానని ఎల్బీ శ్రీరాం తెలిపారు.
అయితే పెళ్లి తంతు ముగిసిన తర్వాత అప్పగింతల సమయంలో తాను ఏడుపు ఆపుకోలేకపోయినట్లు ఎల్బీ శ్రీరాం వెల్లడించారు.దూరంగా వెళ్లి ఒంటరిగా ఏడుస్తున్నానని.తనకు తెలియకుండానే కొంతమంది ఆడవాళ్లు తనను గమనించారని అన్నారు.వారు కూడా ఆడపిల్ల తండ్రిగా ఇది తప్పదని అన్నారని వివరించారు.
అయితే ఆ సమయంలో తాను రాసిన హిట్లర్ సినిమాలోని సీన్ గుర్తుకు వచ్చినట్లు ఎల్బీ శ్రీరాం వెల్లడించారు.
హిట్లర్ సినిమాలో చిరంజీవి తన చెల్లెలిని అప్పగింతల సమయంలో చెప్పాల్సిన నాలుగు మాటలు తనకు గుర్తుకు వచ్చాయని అన్నారు.అనుకోకుండా తన చెల్లికి ఓ మామూలు సంబంధం చూసి పెళ్లి చేయగా.చెల్లి అప్పగింతల సమయంలో ఒక్క మాట మాట్లాడకుండా ఉంటాడని ఎల్బీ శ్రీరాం తెలిపారు.
చివర్లో మాత్రం ‘మీ అన్నయ్య ఏం పెట్టాడమ్మా అని ఎవరైనా అడిగితే మాత్రం.చిన్నప్పటి నుండి ఆశలు పెట్టాడు, పెళ్లికి కష్టాలు పెట్టాడు అని చెప్పమ్మా’ అనే డైలాగ్ చిరంజీవి చెబుతాడని ఎల్బీ శ్రీరాం తెలిపారు.తన కూతురి అప్పగింతల సమయంలో ఎందుకో హిట్లర్ సినిమాలో తాను రాసిన సీన్ గుర్తుకు వచ్చిందని, కానీ ఆడపిల్ల తండ్రిగా ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే అని ఎల్బీ శ్రీరాం చెప్పుకొచ్చారు.