గతేడాది డిసెంబర్‌లో కెనడాలో( Canada ) 21 ఏళ్ల భారత సంతతి యువతి హత్య కేసులో హంతకుడి కోసం అక్కడ దేశవ్యాప్తంగా అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.2022 డిసెంబర్ 3న మిస్సిసాగాలోని గ్యాస్ స్టేషన్ వెలుపల 21 ఏళ్ల పవన్ ప్రీత్ కౌర్( Pawan Preet Kaur ) అనే పంజాబీ సంతతికి చెందిన యువతిని దుండగులు కాల్చిచంపిన ఘటన అప్పట్లో కలకలం రేపింది.ఘటన జరిగిన రోజు రాత్రి 10.40 గంటలకు క్రెడిట్ వ్యూ రోడ్, బ్రిటానియా రోడ్ వెస్ట్‌లో వున్న పెట్రో కెనడాలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు పీల్ రీజినల్ పోలీసులు తెలిపారు.సమాచారం అందిన వెంటనే తాము అక్కడికి చేరుకున్నామని.బుల్లెట్ గాయాలతో పడివున్న పవన్‌ప్రీత్ కౌర్‌కు వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం దక్కలేదని, ఆమె ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.
పవన్ ప్రీత్ కౌర్.గ్రేటర్ టొరంటో ఏరియాలోని బ్రాంప్టన్ టౌన్‌సిప్ నివాసి.
నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పవన్‌ప్రీత్‌ను హత్య చేసిన హంతకుడిని అరెస్ట్ చేయకపోవడంతో అక్కడి పోలీస్ యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో పీల్ రీజనల్ పోలీస్ (పీఆర్‌పీ) అనుబంధ హోమిసైడ్ బ్యూరో ( Homicide Bureau )సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.పవన్‌ప్రీత్‌ను హత్య చేసిన వ్యక్తిని గుర్తించినట్లు తెలిపింది.ఈ మేరకు 30 ఏళ్ల ధరమ్ సింగ్ ధాలివాల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు అందులో పేర్కొన్నారు.ఇతను గతేడాది కనిపించకుండా పోయాడని.ఇది పవన్‌ప్రీత్ కౌర్ హత్య పథకంలో భాగమని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ధరమ్ సింగ్ ధాలివాల్ ( Dharam Singh Dhaliwal )5 అడుగుల 8 అంగుళాల పొడవు, 170 పౌండ్ల బరువు, అతని ఎడమ చేతిపై పచ్చబొట్టు వున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ హత్య కేసుకు సంబంధించి అతని కుటుంబ సభ్యులలో ఇద్దరిని ఏప్రిల్ 18న న్యూ బ్రున్స్‌విక్‌లోని మోంక్టన్‌లో అరెస్ట్ చేశారు.వారిని ప్రిత్‌పాల్ ధాలివాల్ (25), అమర్‌జిత్ ధాలివాల్ (50)గా గుర్తించారు.అంతేకాకుండా.ధరమ్ సింగ్‌కు ఎవరైనా సహాయం చేసినా, ఆశ్రయం కల్పించినా వారిపైనా చర్యలు తీసుకుంటామని పీల్ రీజినల్ పోలీసులు హెచ్చరించారు.ధరమ్ సింగ్ ఎక్కడున్నా తక్షణం న్యాయవాదులను ఆశ్రయించాల్సిందిగా సూచించారు.