Buddha Venkanna: అయ్యన్నపాత్రుడిని సిఐడి పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం - బుద్దా వెంకన్న

విజయవాడ: టీడీపీ నేత బుద్దా వెంకన్న కామెంట్స్.అయ్యన్నపాత్రుడిని సిఐడి పోలీసులు దొంగల్లా వచ్చి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం.

 Buddha Venkanna Condemns Ayyannapatrudu Arrest Details, Buddha Venkanna ,ayyanna-TeluguStop.com

బిసిల మీద జగన్ రెడ్డి చేస్తున్న దాడి ఇది.బీసలంటే జగన్ రెడ్డికి చులకన.జగన్ కుటుంబం ఒక బిసి వ్యక్తి ని చంపి, గనులను స్వాధీనం చేసుకున్నారు.బిసిల రక్తం తాగడం, చంపడం, దాడి చేయడం జగన్ రెడ్డి నైజం.వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ కుటుంబ సభ్యులు ఉన్నారు.జగన్ రెడ్డి సోదరి షర్మిలానే ఈ విషయం చెప్పారు.

వీటి నుంచి డైవర్షన్ రాజకీయం కోసమే అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేశారు.జగన్ వేసే బిస్కట్ లు తినే వైసిపి బిసి నాయకులు మాట్లాడరా.

మీకు బిసి సంక్షేమం పట్టదు… మీకు పదవులే ముఖ్యమా.

అయ్యన్నపాత్రడు ఫోర్జరీ సంతకం చేస్తే .అది సివిల్ కేసు కదా.ఆ కేసుకు అర్ధరాత్రి సిఐడి పోలీసులు అరెస్టు చేస్తారా.ఎపి లో బిసి లు బతకాలంటే భయమేస్తుంది.కోర్టు కూడా అక్షింతలు వేసినా జగన్ లో మార్పు రావడం లేదు.జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, జె గ్యాంగ్ ఉత్తరాంధ్ర లో యాభై వేల కోట్ల ఆస్తులు కబ్జా చేశారు.ఒక్క రాజధానికి దిక్కు లేదు.

మూడు రాజధానులంట.ఎపిలో బిసి నాయకులను లక్ష్యం చేసుకుని జగన్ ఇబ్బందులు పెడుతున్నారు.

సిఐడి ఛీఫ్ సునీల్ జగన్ మోచేతి నీళ్లు తాగు తున్నారు.ప్రజలకు రక్షణగా ఉండాలని నీకు ఉద్యోగం ఇచ్చారు.

తీరు మార్చు కోక పోతే భవిష్యత్తు లో ఇబ్బందులు తప్పవు.యేడాదిన్నర మాత్రమే ఇంకా వాళ్లు అధికారంలో ఉంటారు.మొన్న నన్ను కూడా అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించారు.ఇంట్లో మహిళలు, పిల్లలు ఉన్నా నీచంగా వ్యవహరిస్తారా.

అయ్యన్నపాత్రుడి ని వెంటనే కోర్టు లో హాజరు పరచాలి.రఘురామకృష్ణ రాజు తరహాలో కొట్టాలని చూస్తున్నారు.

ఆయన్ని ఇబ్బంది పెట్టేలా కుట్ర జరుగుతుంది.ఈ విషయం పై మేము న్యాయ పోరాటం చేస్తాం.

సోమవారం విశాఖ వెళ్లి ఉత్తరాంధ్ర టిడిపి ఇన్ చార్జి గా సమావేశం పెడతాను.ఉత్తరాంధ్ర లో జగన్ అవినీతి పై పోరాట కార్యాచరణ రూపొందిస్తాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube