ఈ భూ ప్రపంచంలో సంగీతం అంటే ఇష్టపడని మానవుడు ఉండనే ఉండడు అనడంలో సందేహమే లేదు.అవును, సంగీతం రాయిని కూడా కదిలించగలదు.
ఒక రోగి సైతం సంగీతం విని పులకిస్తాడు.అందుకే ప్రపంచంలో ఎన్ని కళలు వున్నా, సంగీతానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
ఫారిన్ కంట్రీలలో పాప్ స్టార్లకు వున్న గిరాకీ మరీ ఇతర వ్యాపారాలకు వుండదు.అంతేకాకుండా మన ఇండియాలోకూడా సగటు ఓ సినిమా దర్శకుడు కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అంటే అతిశయోక్తి కాదేమో.
అయితే ఇపుడు ఈ తంతంతా ఎందుకని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓ శుభవార్త తీసుకువచ్చింది.
ప్రైమ్ సబ్‌స్ర్కైబర్లకు త్వరలో 10 కోట్ల పాటలను షఫుల్ మోడ్‌లో అందించనున్నామని తాజాగా ప్రకటించింది.ఇక్కడ సంతోషించదగ్గ విషయం ఏమంటే, యాడ్‌లు లేకుండా సంగీతాన్ని విని ఆనందించొచ్చని పేర్కొనడం.
అవును, ఇపుడు మీరు యాడ్ ఫ్రీ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు.
ఇంతకు మునుపు ఇక్కడ మ్యూజిక్ వినాలంటే యాడ్స్ తో ఒకింత ఇబ్బందికరంగా ఉండేది.ఇపుడు అలాంటి సమస్య వుండదు.ఇకపోతే ఇప్పటి వరకు ప్రైమ్ మెంబర్లకు 20 లక్షల పాటలు మాత్రమే అందుబాటులో ఉండేవి.
ఈ నేపథ్యంలో మ్యూజిక్ కేటలాగ్‌ను 10 కోట్లకు విస్తృతం చేస్తూ అమెజాన్ తాజా నిర్ణయం తీసుకొని సంచలనం సృష్టించింది.యూజర్లు ఇప్పుడు తమకు ఇష్టమైన సాంగ్స్ ఎక్కడి నుండైనా యాడ్స్ లేకుండా వినొచ్చు.
ఇంకోవిషయం ఏమిటంటే, ట్రెండింగ్‌లో ఉన్న పాటలను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా తర్వాత ఇంటర్నెట్ లేకున్నా ఆఫ్‌లైన్‌లో ఆ పాటలను వినడానికి వెసులుబాటు కలదు.