కన్నడ ఇండస్ట్రీ నుండి ఇటీవలే కాంతారా వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది.రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన కాంతారా సినిమా కన్నడంలో రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర అసాధారణమైన విజయాన్ని నమోదు చేసుకుంది.
కేవలం 16కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వందల కోట్లకు పైగానే కలెక్ట్ చేసి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
ఇక కన్నడ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన వెంటనే తెలుగులో కూడా డబ్బింగ్ చేసి వదిలారు.
తెలుగులో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది.అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన విషయం తెలిసిందే.
ముందుగానే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసిన అల్లు అరవింద్ ఈ సినిమా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఆక్యుపెన్సీ మరింత పెంచడంతో ఇక్కడ కూడా భారీ వసూళ్లు రాబట్టింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు 34 కోట్లు వసూలు చేసింది.
ఫైనల్ రన్ ముగిసే సమయానికి 40 కోట్లకు చేరుకుంటుంది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో వసూళ్లు సాధించడం మాములు విషయం అయితే కాదు.దీంతో అల్లు అరవింద్ కు కాసుల పంట పండడం ఖాయం అని అంతా అనుకున్నారు.కానీ ఈ సినిమా అన్ని లాభాలు తెచ్చుకున్న పెద్దగా వీరికి వచ్చింది ఏమీ లేదట.

ఎందుకంటే ఈ సినిమా తెలుగు హక్కులను అల్లు అరవింద్ కొనుగోలు చేయకుండా పర్శంటేజ్ బేస్ మీదనే రిలీజ్ చేయడంతో టోటల్ గ్రాస్ లో 10% మాత్రమే కమిషన్ తీసుకునేలా థియేటర్స్ లోకి తీసుకు వచ్చారట.దీంతో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిన పెద్దగా వచ్చిన లాభం ఏమీ లేదని చెబుతున్నారు.లాభాలన్నీ సినిమాను నిర్మించిన హోంబలే నిర్మాతలకే వెళుతుందట.అల్లు అరవింద్ పూర్తిగా కొనుగోలు చేసి ఉంటే భారీ లాభాలు వచ్చేవి.