బ్రేకింగ్ : ప్రముఖ గాయని వాణీ జయరాం కన్నుమూత

తెలుగు పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.ప్రముఖ గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు.

 Breaking: Iconic Singer Vani Jayaram Passes Away-TeluguStop.com

చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.వాణీజయరాంకి ఇటీవలే కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.

తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న వాణీ జయరాం జన్మించారు.ఆమె అసలు పేరు కలైవాణి.

ఆరుగులు అక్కాచెల్లెళ్లలో ఆమె ఐదో సంతానం.వాణీ జయరాం కర్ణాటక సంగీతంలో దిట్టని చెప్పొచ్చు.

తెలుగులోనే కాక పలు భాషల్లో పాటలు పాడిన ఘనత వాణీ జయరాంది.హిందీ చిత్రం ‘గుడ్డి’ సినిమాలో బోలె రే పపీ హరా అనే సాంగ్ ద్వారా సినీ నేపథ్య గాయనిగా పరిశ్రమలో అడుగుపెట్టారు.

వాణీ జయరాం బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగు సినిమా సంగీతంపై ఆమె ప్రభావం ఎక్కువగానే ఉందని తెలుస్తోంది.స్వాతి కిరణం సినిమాలో ఆమె పాడిన పాటలకు ఎంతో గుర్తింపు వచ్చింది.

శంకరాభరణం, స్వాతిముత్యం, స్వాతి కిరణం, ఘర్షణ వంటి సినిమాల్లో పాటలు పాడి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు.అంతేకాదు వేల సంఖ్యలో భక్తి గీతాలను వాణీ జయరాం ఆలపించారు.

సంగీత రంగంలో ఆమె సేవలను గుర్తించిన కేంద్రం ‘పద్మ భూషణ్’ అవార్డును ప్రకటించింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube