అఖండ సినిమా అంచనాలకు మించి విజయం సాధించడంతో పాటు బాలయ్యలో జోష్ పెంచిన సంగతి తెలిసిందే.ఈ సినిమా రిజల్ట్ ఇచ్చిన ఉత్సాహంతో బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో నటించారు.
వీరసింహారెడ్డి సినిమా సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా ఉంది.ఫ్యాన్స్ బాలయ్య మూవీ నుంచి ఏం కోరుకుంటారో ఆ అంశాలన్నీ సినిమాలో ఉంటాయని సమాచారం అందుతోంది.
ఈ సినిమాలో బాలయ్య విశ్వరూపాన్ని చూడబోతున్నామని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సినిమాలో యాక్షన్ సీన్లు ఎక్కువగానే ఉన్నాయని బోగట్టా.
పెద్ద బాలయ్య పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య వరలక్ష్మీ కాంబినేషన్ సీన్లు ఎమోషనల్ గా ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ గా కనిపించనున్నారని బోగట్టా.
ఫస్ట్ హాఫ్ లోని 20 నిమిషాల సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని సమాచారం అందుతోంది.పొలిటికల్ గా కనెక్ట్ అయ్యే డైలాగ్స్ ఈ సినిమాలో ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది.సెకండాఫ్ లో మూడు పాటలు ఉంటాయని బోగట్టా.
వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య ధరించిన వాచ్ హైలెట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.ఈ వాచ్ ఖరీదు ఏకంగా 25 లక్షల రూపాయలు అని సమాచారం.
అయితే ఈ వాచ్ ను నారా బ్రాహ్మణి బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది.బ్రాహ్మణి తండ్రిపై ఈ స్థాయిలో ప్రేమను చూపించారా? అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాను కూడా పవర్ ఫుల్ గా తెరకెక్కనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య పవర్ ఫుల్ ప్రాజెక్ట్ లలో వరుసగా నటిస్తూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు.
బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.