మహా సముద్రంలో ఎన్నో రకాల జీవ రాసులు నివసిస్తూ ఉంటాయి.భీమి మీద కంటే సముద్ర గర్భం లోనే ఎక్కువ రకాల జీవ రాసులు నివసిస్తాయి అంటే అతియసోక్తి కాదేమో.
ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటు లోకి వచ్చాక మనం నిత్యం ఎన్నో రకాల సముద్ర జీవులను చూస్తూనే ఉంటాం.ముఖ్యంగా చేపల విషయంలో ఇది జరుగుతుంది.
నిత్యం జాలర్ల చేతికి అరుదైన చేపలు దొరుకు తూనే ఉంటాయి.అవి సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో వాటి గురించి నెటిజెన్స్ కూడా తెలుసు కుంటున్నారు.అయితే తాజగా జపాన్ కు చెందిన జాలరుకి ఒక అరుదైన చేప దొరికిందట.అది టూనా చెప్పగా గుర్తించారు.
సాధారణంగా టూనా చేపలు మిగతా చేపల కంటే చాలా ఖరీదు ఎక్కువుగా ఉంటాయి.

అంతరించి పోయే జాతి చేపల్లో ఈ టూనా చేపలు కూడా ఉన్నాయి.అందుకే ఈ చేపలు అధిక రేటు ఉంటాయి.ఈ టూనా చేపల్లో కూడా బ్లుఫిన్ టూనా చేపల ఖరీదు ఇంకా అధికమట.
చాలా అరుదుగా మాత్రమే ఇవి కనిపిస్తాయట.అయితే ఈ చేపలను వేటాడడం అన్ని దేశాల్లో కుదరదు.
కొన్ని దేశాలు మాత్రమే ఈ జాతి చేపలను వేటాడే అనుమతి ఉంటుంది
ఇటీవలే జపాన్ దేశంలో ఒక జాలరికి 278 కిలోల బ్లుఫిన్ టూనా చేప దొరికింది.ఈ చేపను వేలంలో అత్యంత ఖరీదుకు అమ్మేసారు. 2.5 మిలియన్ ఫౌండ్లకు అమ్మారట.అంటే మన దేశ కరెన్సీలో సుమారు 25 కోట్ల రూపాయలు.
ఒక చేప ఇంత ఖరీదా అని ఆశ్చర్య పోకండి.అరుదైన చేప కాబట్టి ఈ చేపకు అంత రేట్ పెట్టారని నిపుణులు అంటున్నారు.
విన్నారుగా అరుదైన చేప రేట్ ఎంత పలికిందో.ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప గా చెబుతున్నారు.