రాష్ట్ర మంత్రులు డబ్బులు పంచితే శాసన మండలి ఎన్నికలు నిజాయితీగా జరుగుతాయా అని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.
నిష్పక్షపాతంగా వైకాపా ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహిస్తారని బీజేపి పార్టీకి అసలు నమ్మకం లేదని తెలిపారు.
బాధ్యతారాహిత్యంగా వీడియోలో అడ్డంగా దొరికిన మంత్రిని గవర్నర్ బర్తరఫ్ చేయాలని, రాష్ట్ర డిజిపి కేసు నమోదు చేయాలని, ఎన్నికల సంఘం తక్షణం దీనిమీద స్పందించాలని డిమాండ్ చేశారు.