గత రెండు రోజులుగా విక్టరీ వెంకటేష్, రానా(Venkatesh, Rana) నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు(Rana Naidu) పై తీవ్రమైన చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది, విపరీతమైన హింస, శృతి మించిన బూత్ సన్నివేశాలు బూతు డైలాగులు తో వెబ్ సిరీస్ మోత మోగిపోతుందని , 20 సంవత్సరాలుగా ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న వెంకటేష్ కు ఇది మాయని మచ్చగా మిగిలిపోతుందని అసలు ఈ సినిమా ఆయన ఎలా ఒప్పుకున్నారు అంటూ ఆయన అభిమానులు తో పాటు మహిళా అభిమానులు సామాన్య ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో విమర్శలు కురిపిస్తున్నారు.ఈ సందర్భంగా అసలు బూతులు లేకుండా వెబ్ సిరీస్ తీసే అవకాశం లేదా అన్న చర్చ కూడా తీవ్రం గా నడుస్తుంది .
ఎందుకంటే ఈ మధ్య వచ్చిన దాదాపు అన్ని వెబ్ సిరీస్ లోను శృతి మించిన హింస , నైతిక పతనాన్ని ప్రోత్సహించే సన్నివేశాలు మామూలు అయిపోయాయి ….తెలుగు డైరెక్టర్లు తీస్తున్న వెబ్ సిరీస్ లో కూడా ఇదే పందా లో ఉండటం ఆశ్చర్యకరం .వెబ్ సిరీస్ అంటేనే ఇవన్నీ ఉండాలి అనే అందరూ ఫిక్స్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది .
పంచాయతీ లాంటి వెబ్ సిరీస్(Web series) ఇవేమీ లేకుండా అంత పెద్ద హిట్ ఎలా అయింది అన్నది ఆలోచిస్తే అర్థమవుతుంది కావలసింది ప్రేక్షకుల ను ఆకట్టుకునే కథ , కథనాలు తప్ప ఇలాంటి జిమ్మిక్కులు కాదని.మరి మన ఫిలిం మేకర్స్ అసలునీ పక్కన పెట్టి ఇలాంటి కొసరు వ్యవహారాల మీద ఎందుకు అంతగా దృష్టి పెడుతున్నారు అర్థం కావడం లేదు.ఇతర బాష ల నుండి కథ తీసుకోవచ్చు కానీ మన ఆ భూతులను కూడా ఎండకు తీసుకు రావడం? వెబ్ సిరీస్ కి సెన్సార్ లేదు అన్న ఒక్క లూపు హోల్ ని అడ్డం పెట్టుకొని అడ్డమైన చెత్తనీ తీసుకొచ్చి ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు… ఈ మధ్య జరిగిన చాలా దొంగతనాలు , హత్యలు కొన్ని వెబ్ సిరీస్ ల లను ఇన్స్పిరేషన్ గా తెసుకుని చేసామని ముద్దాయిలు ఒప్పుకున్న సంఘటనలు కూడా మనం పేపర్లో చాలా చదివాo.రోజురోజుకీ తీవ్రమవుతున్న అక్రమ సంబంధాలు, భర్తలను అడ్డు తొలగించుకున్న సంఘటనలు మన రోజు పేపర్లను చదువుతున్నాo.ఎంత కాదనుకున్నా వీటికి ఎంతో కొంత మోరల్ బుస్టింగ్ ఈ వెబ్ సిరీస్ నుంచే అందుతుందన్న విషయాన్ని మనం కాదనలేం .పుస్తకాల ప్రభావం సినిమాల ప్రభావం ఎంత కాదనుకున్నా సామాన్య ప్రజలపై ఉంటుంది .అతి ఎప్పుడైనా అనర్ధ దాయకమే ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ దిశగా దృష్టి సారించి వెబ్ సిరీస్ లను కూడా సెన్సార్ చేస్తే తప్ప వీటిని కంట్రోల్ చేయటం సాధ్యమయ్యేలా లేదు