బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌ : ఆ ముగ్గురు టాప్‌ 3 అంటున్న ఫ్యాన్స్‌

తెలుగు బిగ్ బాస్ గత 5 సీజన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.అందుకే డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా బిగ్ బాస్ ను కొత్తగా తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశారు.

 Biggboss Nonstop Top 3 Contestants Bindu Madhavi Ariyana Akhil Details, Bb Non-TeluguStop.com

డిస్నీ ప్లస్‌ హాట్స్టార్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.మొదటి వారం లో కంటెస్టెంట్స్ విషయం లో కాస్త అసంతృప్తి వ్యక్తం అయినా మెల్ల మెల్లగా బిగ్ బాస్ కి ప్రేక్షకులు అలవాటు పడుతున్నారు.

స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ తో పోలిస్తే ఈ బిగ్ బాస్ కి రేటింగ్‌ తక్కువ వస్తున్నా కూడా మొత్తానికి ప్రేక్షకుల ఆదరణ పొందడంలో సఫలం అవుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఈ సమయంలో బిగ్ బాస్ టాప్ 3 గా ఎవరు నిలుస్తారు అనే విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

ఇప్పటికే బిగ్ బాస్ ప్రేక్షకులు బిందు మాధవి ని తెగ ఆదరించడం.అభిమానించడం మొదలు పెట్టారు.

ఆమె పేరుతో సోషల్ మీడియాలో ఏకంగా ఆర్మీ నే మొదలు పెట్టి ఆమెను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు.ఒక వేళ ఆమె ఎలిమినేషన్ కి నామినేట్ అయితే గంపగుత్తగా ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇప్పటికే ఆమె విజేత అంటూ చాలా మంది బలంగా నమ్ముతున్నారు.ఈ సమయంలోనే అరియానా మరియు అఖిల్‌ కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ ఫైనల్ వరకు ఉంటారని టాక్ ఉంది.

గత సీజన్లలో వీరిద్దరు కూడా ఫైనల్ వరకు వచ్చారు.

Telugu Akhil Sarthak, Ariyana, Bb Nonstop, Bigg Boss, Biggboss, Bindu Madhavi, M

కానీ విజేతగా మాత్రం నిలువలేకపోయారు.ఈ సీజన్లో మాత్రం వీరిద్దరూ కచ్చితంగా టాప్ త్రీ లో ఉంటారని ట్రోఫీని కూడా గెలుచుకుంటారని వారి వారి అభిమానులు నమ్మకంగా ఉన్నారు.ఈ ముగ్గురు ఏదైనా అనూహ్య పరిణామం జరిగి బ్యాడ్ గా ప్రేక్షకుల ముందు మారితే తప్పితే టాప్ 3 లో నిలువకుండా ఉండరు అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రెండు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నుండి మొదటి వారంలో ముమైత్ ఖాన్ ఎలిమినేట్‌ అవ్వగా రెండవ వారం లో శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube