బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌ : ఆ ముగ్గురు టాప్‌ 3 అంటున్న ఫ్యాన్స్‌

తెలుగు బిగ్ బాస్ గత 5 సీజన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.అందుకే డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా బిగ్ బాస్ ను కొత్తగా తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశారు.

డిస్నీ ప్లస్‌ హాట్స్టార్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

మొదటి వారం లో కంటెస్టెంట్స్ విషయం లో కాస్త అసంతృప్తి వ్యక్తం అయినా మెల్ల మెల్లగా బిగ్ బాస్ కి ప్రేక్షకులు అలవాటు పడుతున్నారు.

స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ తో పోలిస్తే ఈ బిగ్ బాస్ కి రేటింగ్‌ తక్కువ వస్తున్నా కూడా మొత్తానికి ప్రేక్షకుల ఆదరణ పొందడంలో సఫలం అవుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఈ సమయంలో బిగ్ బాస్ టాప్ 3 గా ఎవరు నిలుస్తారు అనే విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

ఇప్పటికే బిగ్ బాస్ ప్రేక్షకులు బిందు మాధవి ని తెగ ఆదరించడం.అభిమానించడం మొదలు పెట్టారు.

ఆమె పేరుతో సోషల్ మీడియాలో ఏకంగా ఆర్మీ నే మొదలు పెట్టి ఆమెను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు.

ఒక వేళ ఆమె ఎలిమినేషన్ కి నామినేట్ అయితే గంపగుత్తగా ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇప్పటికే ఆమె విజేత అంటూ చాలా మంది బలంగా నమ్ముతున్నారు.ఈ సమయంలోనే అరియానా మరియు అఖిల్‌ కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ ఫైనల్ వరకు ఉంటారని టాక్ ఉంది.

గత సీజన్లలో వీరిద్దరు కూడా ఫైనల్ వరకు వచ్చారు. """/"/ కానీ విజేతగా మాత్రం నిలువలేకపోయారు.

ఈ సీజన్లో మాత్రం వీరిద్దరూ కచ్చితంగా టాప్ త్రీ లో ఉంటారని ట్రోఫీని కూడా గెలుచుకుంటారని వారి వారి అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

ఈ ముగ్గురు ఏదైనా అనూహ్య పరిణామం జరిగి బ్యాడ్ గా ప్రేక్షకుల ముందు మారితే తప్పితే టాప్ 3 లో నిలువకుండా ఉండరు అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రెండు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నుండి మొదటి వారంలో ముమైత్ ఖాన్ ఎలిమినేట్‌ అవ్వగా రెండవ వారం లో శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యారు.

చిన్న వయసులోనే వైట్ హెయిర్ రావడం స్టార్ట్ అయిందా.. డోంట్ వర్రీ ఈ టిప్స్ మీకోసమే!