బిగ్ బాస్ సీజన్ 5లో సీజన్ 4 కంటెస్టంట్స్ సందడి చేయనున్నారు.బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకుంది.
బిగ్ బాస్ సీజన్ 5 దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారు.ఈ ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ సీజన్ 4 క్రేజీ కంటెస్టంట్స్ దివి, మోనాల్ గజ్జర్ లు స్పెషల్ పర్ఫార్మెన్స్ లు ప్లాన్ చేశారట.
వీరితో పాటుగా ఇద్దరు హీరోయిన్స్ కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తారని తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటికే ఆడియెన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకోగా దాన్ని మరింత పెంచేలా బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.అయితే దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా హోస్ట్ నాగార్జునతో పాటుగా సుమ కూడా కొద్దిగా యాంకరింగ్ లో సాయం చేస్తుందని తెలుస్తుంది.
మొత్తానికి దీపావళి ఎపిసోడ్ సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటుందని తెలుస్తుంది.తప్పకుండా దీపావళికి బిగ్ బాస్ ఆడియెన్స్ అందరు సూపర్ అనిపించేలా షోని ప్లాన్ చేశారట. మరి దసరా ఎపిసోడ్ సూపర్ ఎంటర్టైన్ చేయగా దీపావళి ఎపిసోడ్ కూడా బిగ్ బాస్ ఆడియెన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చేలా ఉందని చెప్పొచ్చు.