Pawan Kalyan Vasanthi Janasena Party: పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే చాలు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: వాసంతి

తెలుగు బుల్లితెర పై ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి వాసంతి.పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కెరియర్ మొదట్లో మోడల్ గా తన కెరియర్ ప్రారంభించిన ఈమె అనంతరం సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన కాలిఫ్లవర్ సినిమాలో హీరోయిన్ గా నటించారు.

 Bigg Boss Vasanthi Wishes To Contest As Mla From Pawan Kalyan Janasena Party Det-TeluguStop.com

అదేవిధంగా సుడిగాలి సుదీర్ నటించిన వాంటెడ్ పండుగాడ్ సినిమా ద్వారా కూడా సందడి చేశారు.ఇలా ఈ రెండు సినిమాలలో నటించిన ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.

బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా 10 వారాల పాటు కొనసాగిన వాసంతి పదవ వారం ఎలిమినేట్ అయ్యారు.ఈ విధంగా ఈమె ఎలిమినేట్ కావడంతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనని ఇన్ని రోజులపాటు హౌస్ లో కొనసాగేలా చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇక ఈమె పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో తనకు పవన్ ఫాన్స్ సపోర్ట్ చేశారని ప్రత్యేకంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు ఎంతో గొప్పగా చెప్పే ఈమె తనకు పవన్ కళ్యాణ్ గారు కనుక అవకాశం ఇస్తే జనసేన పార్టీ నుంచి తప్పకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Janasena, Pawan Kalyan, Pawankalyan, Vasanthicontest-Movie

ఈ విధంగా జనసేన పార్టీ తరఫున రాజకీయాలలోకి రావడానికి వాసంతి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని అర్థమవుతుంది.ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అవకాశం వస్తే నటిస్తారా అనే ప్రశ్న ఎదురవడంతో తనకు అవకాశం రావాలే కానీ నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈమె తెలిపారు.కేవలం రెండు సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాకపోయినా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె రాజకీయాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube