హ్యాపీ డేస్ సినిమా ఆడిషన్ కి వెళ్తే డబ్బులు డిమాండ్ చేశారు... సన్నీ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం వెండితెర అవకాశాలను అందుకున్నటువంటి వారిలో నటుడు వి జే సన్నీ( VJ Sunny ) ఒకరు.కెరియర్ మొదట్లో యాంకర్ గా పనిచేశారు.

 Bigg Boss Sunny Shocking Comments About Happy Days Auditions, Bigg Boss,s Unny,-TeluguStop.com

అనంతరం బుల్లితెర నటుడిగా సీరియల్స్ లో నటించే సందడి చేశారు.ఇక బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకొని ఈ సీజన్లో విన్నర్ గా నిలిచారు.

ఇక ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఈయనకు పలు సినిమాలలో అవకాశాలు వచ్చాయి.ఇలా పలు సినిమాలలో నటిస్తూ సన్నీ బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే సన్నీ నటించిన సౌండ్ పార్టీ అనే సినిమా ఈ నెల 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి సన్నీ తన కెరియర్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులతో పాటు బిగ్ బాస్ కార్యక్రమం( Bigg boss ) గురించి కూడా ఎన్నో విషయాలను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన కెరియర్ మొదట్లో సినిమా అవకాశాల కోసం పడిన ఇబ్బందులను వెల్లడించారు తనకు శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) దర్శకత్వంలో తెరకెక్కించిన హ్యాపీడేస్ సినిమా ఆడిషన్ కి వెళ్ళగా ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యానని అయితే ఈ సినిమాలో నటించాలి అంటే పాతిక లక్షలు ఇవ్వాలని అడిగారు అంత డబ్బు ఇచ్చే స్థోమత నాకు లేకపోవడంతో నేను ఈ సినిమా అవకాశాన్ని వదులుకున్నానని సన్నీ తెలిపారు.అప్పటినుంచి తాను ఎంతో కష్టపడుతూనే ఉన్నానని ఈయన ఈ సందర్భంగా తెలియచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube