దేపా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆవారా జిందగీ.( Aawara Zindagi ) ఇందులో బిగ్ బాస్ శ్రీహాన్,( Bigg Boss Srihan ) ముక్కు అజయ్,( Mukku Ajay ) ఢీ ఫేమ్ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే వంటి తదితరులు ఈ సినిమాలో నటించారు.
విభా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మించాడు.ఇక ఈ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో రూపొందింది.
ఇక ఇప్పటికే ఈ సినిమా వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా ఈరోజు ఈ సినిమా థియేటర్లోకి ప్రేక్షకులు ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.అంతేకాకుండా నటీనటులకు ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.ఇందులో శ్రీహన్, అజయ్, చెర్రీ, జస్వంత్ లు ఎటువంటి ఉద్యోగాలు లేక ఆవారాగా తిరుగుతూ ఉంటారు.ఉదయం లేచినప్పటి నుంచి తిరగటం, తాగటం, తినడం అన్నట్టుగానే ఉంటారు.
అంతేకాకుండా చదువుకునే అమ్మాయిలను ఏడిపించడం.పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరగటం, పోలీసులతో దెబ్బలు తినడం వంటి వాళ్ళ పని అని చెప్పాలి.
అయితే వాళ్లంతా ఓ సాఫ్ట్వేర్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కి వెళ్ళటంతో కథ మొత్తం మారుతుంది.అలా కథ మారడం వల్ల వారి జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి.
కిడ్నాప్ అయినా అమ్మాయిని ఎలా కాపాడుతారు అని.ఇంతకు కిడ్నాప్ చేసిన గ్యాంగ్ ఎవరు అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:
శ్రీహన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం.పలు షార్ట్ ఫిలిమ్స్ లలో అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేస్తుంటాడు.ఇక అజయ్, చెర్రీ, జస్వంత్ లు కూడా పాత్రకు తగ్గట్టు నటించారు.అంతేకాకుండా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు.షియాజీ సిండే కూడా బాగా నటించాడు.మిగతా నటీనటులంత పాత్రకు తగ్గట్టు పనిచేశారు.
టెక్నికల్:
టెక్నికల్ విషయానికొస్తే దర్శకుడు చిన్న సినిమాని చూపించిన కూడా మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.కామెడీ సీన్స్ అద్భుతంగా చూపించాడు.
యువతను మెప్పించే విధంగా ఈ సినిమాను చేశాడు.సినిమాటోగ్రఫీ బాగుంది.
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది.మిగిలిన నిర్మాణ విభాగాలు సినిమాకు తగ్గట్టు పని చేశాయి.

విశ్లేషణ:
ఈ మధ్యకాలంలో ఫ్రెండ్షిప్ సంబంధించిన సినిమాలు బాగా వస్తున్నాయి.అందులో ఒకటి ఆవారా జిందగీ. ఈ సినిమా మొత్తం రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అన్నట్లుగా చూపించాడు డైరెక్టర్.పైగా అడల్ట్ కామెడీ తో రావడంతో ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది.
తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా చూపించాడు డైరెక్టర్.

ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, కామెడీ సీన్స్, డైలాగ్స్.
మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపించాయి.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా ప్రతి ఒక్కరిని నచ్చుతుందని చెప్పాలి.ముఖ్యంగా యువతకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.