బిగ్ బాస్ స్రవంతి జీవితంలో విషాదం ఇదే.. అలా చేయడంతో అమ్మ చనిపోయిందంటూ?

ప్రముఖ రియాలిటీ షోలలో ఒకటైన్ బిగ్ బాస్ షో తెలుగు బుల్లితెరపై సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.మరే రియాలిటీ షో సాధించని స్థాయిలో ఈ షోకు రేటింగ్స్ వచ్చాయి.

 Bigg Boss Non Stop Sravanthi Career Troubles Details, Bigg Boss Non Stop, Biig B-TeluguStop.com

అయితే ప్రస్తుతం హాట్ స్టార్ లో బిగ్ బాస్ ఓటీటీ ప్రసారమవుతోంది.ఓటీటీలో ఈ షోకు స్పందన కరువైనా బిగ్ బాస్ షోను అభిమానించే అభిమానులు మాత్రం ఈ షో చూడటానికి ఇష్టపడుతూ ఉండటం గమనార్హం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ప్రసారమవుతున్న ఈ షోలో బిగ్ బాస్ తొలిప్రేమ గురించి చెప్పాలని హౌస్ మేట్స్ కు టాస్క్ ఇవ్వగా హౌస్ మేట్స్ ఒక్కొక్కరు తమ ప్రేమకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.స్రవంతి తన భర్త అయిన ప్రశాంత్ తన మొదట ప్రేమించిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ లోని అమీర్ పేట్ సందులో తను ప్రశాంత్ ను తొలిసారి చూశానని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రశాంత్ తన రూమ్ మేట్ బాయ్ ఫ్రెండ్ స్నేహితుడు అని ఆమె వెల్లడించారు.

Telugu Biigboss, Mother, Prasanth, Sravanthi, Telugubigg-Movie

మొదట ప్రేమిస్తున్నట్టు చెప్పగా ప్రశాంత్ నో చెప్పాడని తొమ్మిది నెలలు కష్టపడిన తర్వాత ప్రశాంత్ నుంచి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ లభించిందని ఆమె చెప్పుకొచ్చారు.అయితే అమ్మకు ప్రేమ విషయం తెలిసి తనకు మరో వ్యక్తితో పెళ్లి చేసే ప్రయత్నం చేశారని ఆమె తెలిపారు.ఆ తర్వాత ఇంట్లోనుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నానని స్రవంతి వెల్లడించారు.

Telugu Biigboss, Mother, Prasanth, Sravanthi, Telugubigg-Movie

కొన్ని నెలల తర్వాత అమ్మ దగ్గరకు వెళ్లాలని అనుకున్నానని అయితే ఆ సమయంలో అమ్మ చనిపోయిందని ఫోన్ కాల్ ద్వారా తెలిసిందని స్రవంతి చెప్పుకొచ్చారు.భర్త అత్తామమ ప్రస్తుతం తన ప్రపంచం అంటూ స్రవంతి భావోద్వేగానికి గురయ్యారు.స్రవంతి కష్టాలు తెలిసి నెటిజన్లు, ఆమె అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube