Bigg Boss Gautham Krishna : బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాకముందే సినిమా అవకాశాన్ని కొట్టేసిన గౌతమ్?

తెలుగు సినీ ప్రేక్షకులకు బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్ గౌతం కృష్ణ( Bigg Boss Contestant Gautham Krishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లక ముందు వరకు గౌతమ్ కృష్ణ ఎవరు అన్న విషయం చాలామందికి తెలియదు.

 Bigg Boss 7 Gautham Krishna New Movie Producer Satish Kumar Comments-TeluguStop.com

బిగ్ బాస్ షో ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు గౌతమ్ కృష్ణ.ఇది ఇలా ఉంటే గౌతమ్ కృష్ణ ఇంకా హౌస్ లో నుంచి బయటికి రాకముందే అప్పుడే హీరోగా అవకాశాన్ని సంపాదించుకున్నాడు.

సెవెన్ హిల్స్‌ నిర్మాణ సంస్థలో గౌతమ్‌ కృష్ణ హీరోగా ఒక సినిమా తీస్తున్నారు.ఆ మూవీలో శ్వేతా అవాస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Telugu Bigg Boss, Gautham Krishna, Satish Kumar, Tollywood-Movie

కాగా ఆ మూవీకి నవీన్ కుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా సతీష్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.అయితే గతంలో బట్టల రామస్వామి( Battala Ramaswami biopikku ) బయోపిక్కు చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.ఆర్పీ పట్నాయక్‌‌తో కాఫీ విత్ ఏ కిల్లర్ మూవీ తీశారు.ఇది సతీష్ కుమార్ నిర్మిస్తున్న మూడవ చిత్రం.కాగా గౌతమ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే మూడు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది.నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్‌( Sevenhills Satish ) పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

గతంలో నేను నిర్మించిన రెండు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి.

Telugu Bigg Boss, Gautham Krishna, Satish Kumar, Tollywood-Movie

ఆకాశవీధుల్లో సినిమాతో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు బిగ్‌బాస్‌ 7 షోతో మరింత పాపులర్‌ అయిన గౌతమ్‌ కృష్ణతో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.గౌతమ్‌ బిగ్‌బాస్‌ నుంచి తిరిగి రాగానే చివరి షెడ్యూల్‌ పూర్తి చేస్తాము.సాధారణ మధ్యతరగతి వ్యక్తి స్టూడెంట్‌ నుంచి కార్పోరేట్‌ స్థాయికి ఎలా ఎదిగాడు అనే పాయింట్‌తో తీస్తున్న సినిమా ఇది.త్వరలో ఫస్ట్‌లుక్, టీజర్‌ రిలీజ్ చేయడంతో పాటు మూవీ విడుదల తేదీని ప్రకటిస్తాం అని నిర్మాత సతీశ్ తెలిపారు.ఈ సందర్భంగా నిర్మాత సతీష్ చేసిన వాఖ్యలు లో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube