వలసదారులకు ఊరట.. అక్రమ అరెస్ట్‌లు, దేశ బహిష్కరణ నిబంధనలను రద్దు చేసిన బైడెన్ యంత్రాగం

టెక్సాస్ ఫెడరల్ కోర్టు తీర్పుపై ప్రతిస్పందించిన బైడెన్ యంత్రాంగం .ప్రజాభద్రత, జాతీయ భద్రతకు ముప్పుగా భావించే వలసదారులను అరెస్ట్ చేయడం, బహిష్కరణకు సంబంధించిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది.

 Biden Administration Suspends Rules Limiting Immigrant Arrest, Deportation Bide-TeluguStop.com

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ లాండ్ సెక్యూరిటీ శనివారం ఒక ప్రకటనలో ఈ మేరకు తెలిపింది.దీనిపై ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు, నిపుణులు మాట్లాడుతూ.

బైడెన్ యంత్రాంగం ఈ ఆర్డర్ ను సస్పెండ్ చేయడం వల్ల వలస వర్గాల్లో పరోక్షంగా భయాన్ని పెంచుతుందన్నారు.దీని వల్ల దేశంలో చట్టవిరుద్దంగా నివసిస్తున్న చాలా మంది తమ ఇళ్లను విడిచి రావడానికి భయపడతారని, వారు చట్టానికి కట్టుబడి వున్నప్పటికీ నిర్బంధించబడతారని కార్నెల్ యూనివర్సిటీలో ఇమ్మిగ్రేషన్ లా ప్రొఫెసర్ స్టీవ్ యెల్ లోహర్ అన్నారు.

ఎవరిని అరెస్ట్ చేయాలి, బహిష్కరించాలి అనే దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వుందన్నారు.ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించే ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయడానికి, విచారించడానికి దేశంలో తగినంత ఐసీఈ ఏజెంట్లు లేరని లోహర్ పేర్కొన్నారు.

కాగా.గతేడాది సెప్టెంబర్‌లో జారీ చేసి మెమో ప్రకారం.జాతీయ భద్రతకు, ప్రజా భద్రతకు ముప్పుగా వున్న వారిపై లేదా ఇటీవల చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని హోమ్ లాండ్ సెక్యూరిటీ అలెజాండ్రో మేయోర్కాస్ సిబ్బందికి నిర్దేశించారు.డొనాల్డ్ ట్రంప్ హయాంలో బహిష్కరణ, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని నిర్బంధించాలని అనే దానిపై ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీలకు విస్తృత అధికారం ఇవ్వబడింది.

చట్టపరమైన హోదా లేని వలసదారుల డ్రైవింగ్ ను నివారించడం ఇందులో ఒకటి.

Telugu Biden, Donald Trump, Federal, Immigrant, Law, Joe Biden, Public Security,

అయితే ఈ ఏడాది జూన్ 10న దక్షిణ టెక్సాస్ లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి డ్రూ టిప్టన్ మయోర్కాన్ మెమోను రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు.టెక్సాస్, లూసియానాలోని రిపబ్లికన్ రాష్ట్ర అధికారులతో పాటు బైడెన్ పరిపాలనా యంత్రాంగానికి అలాంటి ఆదేశాన్ని జారీ చేసే అధికారం లేదని పేర్కొన్నారు.దీనిపై స్పందించిన ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెమోను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube