దారుణం: ఐసీ క్రీం ఇప్పిస్తామంటూ లైంగిక దాడి!

రోజురోజుకీ మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి.ఒకడు భార్య మీద అనుమానంతో నరికొస్తుంటే, ఒకామె ప్రియుడి మోజులో భర్తను చంపేస్తుంది.

 Bhopal Shocker Ice-cream Seller Molests 11-year-old Girl In Jahangirabad Video V-TeluguStop.com

అంతకంటే ఘోరమైన విషయం ఏమిటంటే… అభంశుభం తెలియని పిల్లలను కూడా మానవ రూపంలో ఉన్న రాక్షసులు వదలడం లేదు.తాజాగా అటువంటి ఓ సంఘటన మధ్య ప్రదేశ్( Madhya Pradesh ) రాజధాని భోపాల్ లో( Bhopal ) చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే… జహంగీరాబాద్‌లో ఐస్‌క్రీం అమ్మే వ్యక్తి( Ice Cream Seller ) 11 ఏళ్ల బాలికకు ఉచితంగా ఐస్‌క్రీం ఇప్పిస్తానని అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఓ కెమెరాకు చిక్కాడు.

తరువాత ఈ వీడియోని తీసి సోషల్ మీడియా గుర్తు తెలియని వ్యక్తి ఒకడు పోస్ట్ చేయగా వాడిని ప్రస్తుతం పోలీసులు పట్టుకొని ఈ కేసులో సహ నిందితుడిగా చేర్చారు.అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.జూన్ 28 రాత్రి, ఆమె తన ఇంటి సమీపంలోని వ్యాపారి వద్ద ఐస్‌క్రీం కొనడానికి వెళ్లింది.

తరువాత వాడు బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు.ఇంతలో, ఈ సంఘటనను ఎవరో వీడియో రికార్డ్ చేసి మరుసటి రోజు సోషల్ మీడియాలో( Social Media ) షేర్ చేయడం జరిగింది.

జూన్ 30న కుటుంబ సభ్యులు వీడియో చూసి బాలికను( Girl ) ప్రశ్నించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.వెంటనే వారు జహంగీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాంతో.రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని క్షణాల్లోనే అదుపులోకి తీసుకున్నారు.ఆ బాలికపై ఘోరానికి పాల్పడిన వ్యక్తి యూపీలోని కల్పి నివాసిగా గుర్తించారు.ఆ దుండగుడి పేరు ప్యారే ఖాన్ అలియాస్ ఖలీద్ (52)గా గుర్తించారు.అతడిని కోర్టులో హాజరు పరచగా, అక్కడి నుంచి జైలుకు తరలించారు.అదే విధంగా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన నిందితుడిని కూడా ఈ కేసులో సహ నిందితుడిగా చేర్చి అతడిని పట్టుకునేందుకు ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.

కాగా ఈ వీడియోపైన జనాలు విరుచుకుపడుతున్నారు.ఆ దుర్మార్గుడిని అస్సలు వదలద్దంటూ పోలీసులను కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube