మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల రిమాండ్ పొడిగింపు అయింది.ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఇద్దరినీ నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
సీబీఐ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం భాస్కర్ రెడ్డికి ఈనెల 29 వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.అటు ఉదయ్ కుమార్ రెడ్డికి ఈనెల 26వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
అనంతరం ఇద్దరిని నాంపల్లి కోర్టు నుండి చంచల్ గూడ జైలుకు తరలించారు అధికారులు.